రెండు తలల పాము రూ.కోటి | - | Sakshi
Sakshi News home page

రెండు తలల పాము రూ.కోటి

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

● మోసగాని పట్టివేత

దొడ్డబళ్లాపురం: బురద మట్టిలో తిరిగే రెండు తలల పాముపై మూఢ నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ పామును దగ్గర ఉంచుకుంటే అదృష్టం కలిసివస్తుందని కొందరు ప్రచారం చేస్తూ ఎక్కువ ధరలకు అమ్ముతుంటారు. అదే మాదిరిగా ఓ వ్యక్తి బెంగళూరులో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ పామును ఇంట్లో ఉంచితే ఊరికే డబ్బులు వచ్చిపడతాయని నమ్మించి ఒక వ్యక్తికి కోటి రూపాయలకు విక్రయించాలని ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి రెడ్‌ శాండ్‌ బోవా పామును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే సముద్ర గర్భంలో పెరిగే కోరల్‌ రీఫ్స్‌ ని విక్రయించాలని ప్రయత్నిస్తున్న 6 మందిని అరెస్టు చేసి 970 కోరల్‌ రీఫ్‌ ముక్కల్ని సీజ్‌ చేసినట్లు చెప్పారు.

ఫార్మాలపై సిట్‌ దాడులు

దొడ్డబళ్లాపురం: నకిలీ మందుల తయారీ కేసులో సిట్‌ అధికారులు తాజాగా బెంగళూరులో మూడు ఫార్మా కంపెనీలలో సోదాలు నిర్వహించారు. ఇటీవల రామనగర వద్ద ఓ ఫాంహౌస్‌లో నకిలీ మందుల తయారీ గుట్టురట్టయిన తరువాత సిట్‌ దాడులు జరుపుతోంది. ఆర్‌ఆర్‌ నగర్‌లోని ఆర్‌ఆర్‌ ఫార్మా, చామరాజపేటలోని 2365 ఎల్‌ఎల్‌పీ ఫార్మా, తలఘట్టపురలోని పాటిల్‌ ఫార్మాలలో తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నకిలీ మందులు పట్టుబడినట్టు సమాచారం. గత ఏప్రిల్‌ నెల నుంచి ఇప్పటి వరకూ నకిలీ మందులను మార్కెట్‌లో విక్రయించినట్టు తెలిసింది. సరుకును సీజ్‌ చేసిన అధికారులు ఫార్మా యజమానులకు నోటీసులు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement