రాయచూరు రూరల్: కలబుర్గిలో ఈశాన్య ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా శశీల్ నమోషి, కాంగ్రెస్ పార్టీ తరఫున శరణప్ప మట్టూరు నామినేషన్లను దాఖలు చేశారు. కలబుర్గి ప్రాంతీయ కార్యాలయంలో కమిషనర్ జహీరా నసీంకు వారు తమ నామినేషన్లను అందజేశారు. వారికి మద్దతుగా బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ఉమేష్ జాధవ్, జేడీఎస్ నుంచి మాజీ మంత్రులు వెంకట్రావ్ నాడగౌడ, బండెప్ప కాశంపూర్, కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్, ఖనిజా ఫాతీమా, వేణుగోపాల నాయక్ తదితరులు పాల్గొన్నారు.


