రూ.3 కోట్ల పాల పొడి స్వాహా | - | Sakshi
Sakshi News home page

రూ.3 కోట్ల పాల పొడి స్వాహా

Oct 6 2026 1:30 AM | Updated on Oct 6 2026 1:30 AM

మండ్య: మండ్య జిల్లా పాల యూనియన్‌ (మన్‌మూల్‌) డెయిరీలో పాల పొడి కుంభకోణం బట్టబయలైంది. మండ్య మిల్క్‌ యూనియన్‌ మాజీ అధ్యక్షుడు యు.సి. శివకుమార్‌ అలియాస్‌ శివప్పతో పాటు మరో 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వి.జె.శోభరాణి తెలిపారు. సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో నిర్వహించారు. నిందితులు యు.సి. శివకుమార్‌ (50), పర్చేజింగ్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌కుమార్‌ జాదవ్‌ (45), సిస్టమ్‌ ఆపరేటర్‌ శృతి ఎం.సి. (37), వేర్‌హౌస్‌ ఉద్యోగి రవి (37), లోడింగ్‌ మాస్టర్‌ శ్రీనివాస ఆర్‌.ఎస్‌. (44), పాలపొడి తయారీ యూనిట్‌ మాజీ అధికారి శ్రీనివాస మూర్తి కె.ఎన్‌. (49), కేరళకు చెందిన పాలపొడి కొనుగోలుదారు సురేష్‌ వి.కె. (51), కాంట్రాక్టర్‌ సురేష్‌ యు.జి. (37) ఉన్నారని చెప్పారు.

ఎలా చేశారంటే..

నిందితులు సుమారు రూ. 3 కోట్లు విలువైన పాల పొడిని పక్కదారి పట్టించి నిధులు కాజేశారు. ఆ వ్యత్యాసాన్ని సరిదిద్దేందుకు, రూ. 30 లక్షలతో నాసిరకం పాలపొడిని కొనుగోలు చేసి, మన్‌మూల్‌ డెయిరీ గోదాములో నిల్వ చేశారు. దీనిపై అనుమానం వచ్చిన యాజమాన్య బోర్డు తనిఖీ నిర్వహించగా, తేడా బయటపడింది. ఆగస్టు 30న మద్దూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు జాదవ్‌ యు.సి. శివప్పకు రూ. 30 లక్షల లంచం ఇచ్చినట్లు విచారణలో చెప్పాడని ఎస్పీ శోభరాణి వివరించారు. అలాగే స్కాంలోని లబ్ధిదారులు శివప్పకు రూ. 75 లక్షలు చెల్లించారని చెప్పారు. ఈ కల్తీ పాలపొడిని మార్కెట్‌లోకి విడుదల చేయలేదని, ప్రజలకు ఆందోళన వద్దని ఎస్పీ తెలిపారు. ఏఎస్పీ నాగేశ్‌, డీఎస్పీ యశ్వంత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

దాని స్థానంలో రూ.30 లక్షల

నాసిరకం పొడి నిల్వ: ఎస్పీ శోభ

మండ్య జిల్లా డెయిరీలో భారీ స్కాం

మాజీ అధ్యక్షుడు, ఉద్యోగుల అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement