శివాజీనగర: రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు కోరుతూ మొత్తం 91,278 ఫారం–7లు దాఖలైనట్లు ఈసీ ప్రకటించింది. సర్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం డీకే శివకుమార్ ఆరోపణల నేపథ్యంలో సీఈఓ అన్బుకుమార్ సోమవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు.
ఓటర్ల చేరికకు 9 లక్షలు
● ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చాలని 9,10,732 ఫారం–6 దరఖాస్తులు, ప్రవాస భారతీయుల నుంచి 4,677 ఫారం–6ఎ దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
● సవరణలు లేదా బదిలీ కోసం 11,98,484 ఫారం–8 దరఖాస్తులు దాఖలైనట్లు ఆయన చెప్పారు.
ఇంతమందికి నోటీసులు..
రాష్ట్రంలో సర్‌లో 43,82,313 నోటీసులు జారీ చేసినట్లు అన్బుకుమార్ చెప్పారు. ఇందులో 36,89,063 నోటీసుల్లో విచారణ పూర్తయిందన్నారు.
బెంగళూరులో లక్షకు పైగా దరఖాస్తులు
ఓటరు జాబితాలో చేరికలకు బెంగళూరులో 1,10,594 దరఖాస్తులు అందాయి. బెంగళూరు ఉత్తర ఎంపీ నియోజకవర్గంలో 57,111, దక్షిణలో 42,083 దరఖాస్తులు వచ్చాయి. నోటీసు ఇవ్వకుండా ఎవరి పేరునూ తొలగించలేరని సీఈఓ స్పష్టం చేశారు.
43 లక్షల ఓటర్లకు ఈసీ నోటీసులు
సీఈఓ అన్బుకుమార్ ప్రకటన


