మల్నాడులో వానల తగ్గుముఖం | - | Sakshi
Sakshi News home page

మల్నాడులో వానల తగ్గుముఖం

Aug 4 2026 12:11 AM | Updated on Aug 4 2026 12:11 AM

ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగా నది

శివమొగ్గ వద్ద వర్షంలో ప్రయాణం

శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో రుతుపవన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. తుంగ, భద్ర డ్యాంలలోకి నీటి ప్రవాహం కొనసాగుతుండగా, లింగనమక్కి డ్యాంలోకి తగ్గింది. సోమవారం ఉదయం నాటికి లింగనమక్కి డ్యాంలోకి నీటి ప్రవాహం 59,203 క్యూసెక్కులుగా ఉంది. ఆదివారం 77,580 క్యూసెక్కులుగా ఉండేది. డ్యాం సామర్థ్యం 1,819 అడుగులు కాగా, 1,800 అడుగులకు నీటినిల్వ చేరింది.

తుంగ, భద్ర నదులకు ప్రవాహం

● తుంగ జలాశయంలోకి నీటి ప్రవాహం యథాతథ స్థితి కొనసాగింది. 86,123 క్యూసెక్కులు వస్తుండగా, 89,503 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో తుంగా నది నిండుగా ప్రవహిస్తోంది.

● భద్ర డ్యాంలోకి నీటి ప్రవాహం స్వల్పంగా పెరిగింది. 36,103 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, చాలా తక్కువ మొత్తంలో విడుదల చేస్తున్నారు. 186 అడుగుల గరిష్ట స్థాయి అయితే నీటిమట్టం 163 అడుగులు ఉంది.

అంతటా పొడి వాతావరణం

రాష్ట్రంలో సోమవారం వర్షపాతం నమోదు కాలేదు, బెంగళూరుతో సహా రూరల్‌, ఉత్తర, మధ్య కర్ణాటక జిల్లాల్లో పొడి వాతావరణమే నెలకొంది. రైతులు వానల కోసం ఎదురుచూస్తున్నారు. అనేక జిల్లాల్లో కరువు మేఘాలు అలముకొన్నాయి.

అదుపులోకి వరద పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement