డిపాజిట్ల స్కాంలో సీఐడీ కస్టడీ | - | Sakshi
Sakshi News home page

డిపాజిట్ల స్కాంలో సీఐడీ కస్టడీ

May 19 2026 1:10 AM | Updated on May 19 2026 1:10 AM

బనశంకరి: బెళగావిలో రూ.4,500 కోట్ల డిపాజిట్ల కుంభకోణం కేసులో అక్యూమెన్‌ ఫైనాన్స్‌ అధినేత శివానంద నీలణ్ణవర్‌కు 10 రోజుల పాటు సీఐడీ కస్టడీకి బెళగావి రెండో అదనపు సెషన్స్‌కోర్టు ఆదేశించింది. 35 వేల మంది నుంచి పెట్టుబడులు సేకరించి రూ.వెయ్యి కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయని, లోతైన విచారణ కోసం 10 రోజులు కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోర్టుకు విన్నవించారు. జడ్జి గంగాధర ఆమోదించారు. తనకు బీపీ ఉందని శివానంద తెలిపారు. వైద్యుల్ని అందుబాటులో ఉంచాలని జడ్జి ఆదేశించారు.

కోర్టులో హైడ్రామా

35 వేల మందికి డబ్బు అవసరం లేదు, నేను అవసరమని శివానంద చెప్పగా, న్యాయమూర్తి స్పందిస్తూ అమాయకులకు అన్యాయం జరగరాదని, ప్రభుత్వమే ప్రజలకు రక్షణ కల్పిస్తుందన్నారు. మీరు ప్రజలకు అవసరం కావచ్చు, మంచి చేసి ఉండవచ్చు, కానీ తనకు తెలియదన్నారు. చాలామంది డబ్బులు సేకరించి పారిపోయారని, చరిత్ర నుంచి పాఠం నేర్చుకోవడానికి పలు చట్టాలు తీసుకువచ్చారు, ధర్మో రక్షతి రక్షితః అనే సూక్తిని జడ్జి వినిపించారు. కోర్టు హాల్‌ బయట ఉన్న సోదరున్ని చూసి శివానంద కన్నీరు పెట్టుకున్నారు. నిందితున్ని బెంగళూరుకు తీసుకొచ్చి విచారిస్తారు.

శివానంద వింత వాదనలు

Advertisement
 
Advertisement
Advertisement