బళ్లారి అర్బన్: బళ్లారి జిల్లాలో అక్రమంగా పొందిన రేషన్‌కార్డుల తొలగింపు ప్రారంభమైంది. సుమారు 4,764 బీపీఎల్ కార్డులు రద్దు అయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో అంత్యోదయ కార్డులు 24,773, బీపీఎల్ కార్డులు 2,74,280 ఉన్నాయి. అన్నభాగ్య పథకం కింద పేద కుటుంబాలకు ఉచిత బియ్యం, రాయితీపై ఇతర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం వివిధ సామాజిక భద్రత పథకాలకు బీపీఎల్ కార్డులు ఉన్న వారినే అర్హులుగా ఎంపిక చేస్తోంది. అయితే ఈ జాబితలో ఆర్థికంగా బలంగా ఉన్న వారు ఆదాయపు పన్ను చెల్లింపు దారులు, పేద భూస్వాములు విలాసవంతమైన వాహనాలు, ప్రయాణం చేస్తున్న వారు కూడా ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు అనర్హులైన కార్డులను గుర్తించే ప్రక్రియ ఎక్కువగా స్థానిక స్థాయి ధ్రువీకరణ, ఇంటింటా ఆహార శాఖ పూర్తిగా డిజిటల్ సాంకేతికను ఆశ్రయించింది. రేషన్ కార్డులకు తప్పనిసరిగా ఆధార్ నంబర్, బ్యాంక్ నంబర్, పాన్ కార్డులను జత చేసి సమాచారం సరి చేసి ధ్రువీకరించారు. ఆహార శాఖ అధికారులు, బీపీఎల్ కార్డు పొందడానికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణ కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలకు మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కన్న పెద్ద ఇళ్లు ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో 3 హెక్టార్ల మెట్టు భూమి, సాగునీటి భూమి ఉంటే అనర్హులుగా పరిగణించబడుతారు. జీవనోపాధి కోసం ఆటోలు, ట్యాక్సీలు మినహా సొంత నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారికి కూడా బీపీఎల్ సౌకర్యం అందుబాటులో లేదన్నారు. బళ్లారి గణాంకాల ప్రకారం బళ్లారి తాలూకా 3,960 కార్డులు రద్దు.. కాగా సిరుగుప్ప 243, కురుగోడు 190, సండూరు 168, కంప్లి 59 కార్డులు రద్దు అయ్యాయి. అర్హులైన పేదలకు మాత్రమే అన్నభాగ్య ఇతర ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూరేలా తనిఖీలు కొనసాగుతాయని ఆహార శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవరాజ్ స్పష్టం చేశారు.


