ధార్వాడలో మరో ప్రేమ వివాదం | - | Sakshi
Sakshi News home page

ధార్వాడలో మరో ప్రేమ వివాదం

Apr 9 2026 8:35 AM | Updated on Apr 9 2026 8:35 AM

హుబ్లీ: హుబ్లీ– ధార్వాడ నగరాలకు ఏమైంది.. ఎందుకు ఇలాంటి విపరిణామాలు జరుగుతున్నాయి అని నగరవాసులు కలవరం చెందుతున్నారు. వేర్వేరు మతాలకు చెందిన వారు ప్రేమించుకోవడం, ఇళ్ల నుంచి వెళ్లిపోవడం, ఆపై గొడవలు చెలరేగడం నిత్యకృత్యంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. హుబ్లీలో ఇటీవల జిమ్‌ ట్రైనర్‌, ఓ యువతి వివాదం మరిచిపోకముందే ధార్వాడకు చెందిన ఓ వివాహిత, మరో మతానికి చెందిన వ్యక్తి పరారయ్యారు. అతనికి అదివరకే పెళ్లయిందని సమాచారం. ధార్వాడ జిల్లా కెళగేరిలో నివసించే పెళ్లయిన యువతిని, పొరుగింటిలో ఉండే వివాహితుడు మున్నా మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడని ఆమె తల్లి మంజుల నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

మా ఇంటికి వస్తూ..

తమ కుమార్తె సంజమ్మ (22)ను కారు డ్రైవర్‌ పని చేసే మున్నా తీసుకెళ్లాడని తల్లి విలపిస్తోంది. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుమార్తెకు తమ బంధువుల అబ్బాయితో పెళ్లి జరిగిందని, అయితే కొన్ని కారణాల వల్ల కుమార్తె తనతోనే ఉండేదన్నారు. తాము బాడుగ ఇంట్లో ఉంటామని, ఓ న్యాయవాది దగ్గర మున్నా కారు డ్రైవర్‌ పని చేస్తాడని తెలిపింది. ఈ క్రమంలో తమకు ఒక సొంత ఇల్లు కావాలని, ఎక్కడైనా ఉంటే వెతికి పెట్టాలని మున్నా, సదరు న్యాయవాదికి రూ.10 లక్షలు ఇచ్చాను. దీంతో వారిద్దరూ మా ఇంటికి వచ్చి వెళ్లేవారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని వేళ మున్నా మా ఇంటికి వచ్చి నా కుమార్తెకు మాయమాటలు చెప్పి ఆమెతో పరారయ్యాడని తెలిపింది. తమ కూతురు కొంతకాలంగా కనిపించడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయారు. ఆమెకు మద్దతుగా పలు హిందూ సంఘాల నాయకులు వచ్చారు. సంజమ్మ పరిస్థితి గురించి ఆందోళనగా ఉందని, ఆమె ఎక్కడ, ఎలా ఉందోనని అన్నారు.

వేర్వేరు మతాలకు చెందిన వివాహిత యువతి, యువకుడు పరార్‌

కూతురి జాడ కోసం తల్లి ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement