రాయచూరు రూరల్: వేసవిలో మూడు నెలల పాటు గోశాలలో పశువులకు తాగునీరు, పశుగ్రాసం వంటివి సమకూర్చడానికి రాయచూరు తాలూకా జంబలదిన్నిలో 2020–24లో నిర్మాణాలు చేపట్టిన గోశాల నిరుపయోగంగా ఉండటంపై నిర్మాణం ఘనం.. లబ్ధి శూన్యం అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో మంగళవారం వార్త ప్రచురితమైన సంగతి విదితమే. ఈ విషయంపై బుధవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసన సభ్యులు బసనగౌడ దద్దల్, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ చర్చకు లేవనెత్తారు. పశు సంవర్ధక శాఖ అధికారి పోంసింగ్ మాట్లాడుతూ గోశాలకు రక్షణ గోడ నిర్మాణానికి రూ.70 లక్షల నిధులు అవసరమవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు బదులిచ్చారు.


