బనశంకరి: బెంగళూరు నగరంలో చాపకింద నీరులా డ్రగ్స్ సామాజ్యం సాగుతోంది. ఏ ఠాణా పరిధిలో చూసినా ఇబ్బడిముబ్బడిగా మత్తు పదార్థాల విక్రయం, వాడకం జరుగుతోందని తేలింది. సిటీలో వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న విదేశీ పౌరునితో 8 మందిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.27.42 కోట్ల విలువచేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్‌సింగ్ తెలిపారు. హెబ్బగోడిలో నైజీరియాకు చెందిన ఇమాన్యుయేల్ అనే డ్రగ్స్‌పెడ్లర్‌ను అరెస్ట్ చేశారు.
ఎక్కడెక్కడ ఎవరు?
యలహంకలో కేరళ కు చెందిన మహమ్మద్ నిషాద్, అదేశ్‌ను, మైకో లేఔట్‌లో అసోంకు చెందిన బొబ్బి నాయుడును, బాగలూరులో యలహంకవాసి మహమ్మద్ నాసిర్‌ను, పరప్పన అగ్రహారలో ఓ గంజాయి విక్రేతను అరెస్టు చేసినట్లు కమిషనర్ తెలిపారు. రూ.2.85 లక్షల నగదు, రూ.27.42 కోట్ల విలువచేసే 12 కేజీల ఎండీఎంఏ, 275 గ్రాముల కొకై న్, 34 కేజీల గంజాయి, 40 గ్రాముల బంగారం, 2 బైక్‌లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బయటి రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ను తెప్పించి ఇక్కడ ఐటీ బీటీ ఉద్యోగులకు, విద్యార్థులకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని చెప్పారు. మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న దుండగుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.
8 మంది విక్రేతల అరెస్టు


