రాయచూరు–గిణిగెర రైల్వే పనులు పూర్తి చేయాలి
రాయచూరు రూరల్: రాయచూరు–గిణిగెర రైల్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాయచూరు లోకసభ సభ్యుడు జి.కుమార నాయక్ కోరారు. ఈ మేరకు గురువారం సాయంత్రం నైరుతి రైల్వే జోన్ చీఫ్ జనరల్ మేనేజర్ ముకుల్ శరణ్ మాథూర్‌ను కలసి విన్నవించారు. మాన్వి తాలుకా కుర్డి క్రాసింగ్‌ను స్టేషన్‌గా మార్చాలని సూచించారు. మమదాపూర్‌ను గ్రేటర్ రాయచూరు స్టేషన్‌గా మార్చి.. రాయచూరు బైపాస్ లైన్ ఏర్పాటు చేయాలని అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో అధికారులు సత్యప్రకాష్ శాస్త్రి, ప్రశాంత కుమార్, వెంకటేశ్వరావు పాల్గొన్నారు.
బస్సు ఢీకొని చిన్నారి మృతి
రాయచూరు రూరల్: వేగంగా దూసుకొచ్చిన ఓ కేఎస్‌ఆర్టీసీ బస్సు.. రహదారి దాటుతున్న చిన్నారిని ఢీకొట్టడంతో ఘటనా స్థలంలో మృతి చెందింది. ఈ ఘటన గురువారం సాయంత్రం దేవదుర్గ తాలూకా గబ్బూరు మండలం మదరకల్ గ్రామంలో చోటుచేసుకుంది. మదరకల్ వద్ద విద్యాశ్రీ (4) రహదారి దాటుతుంటుగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మరణించిందని పోలీసులు తెలిపారు. గబ్బూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎయిడ్స్‌పై
అవగాహన తప్పనిసరి
రాయచూరు రూరల్: దేశాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్‌పై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి సురేంద్రబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం వద్ద జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆరోగ్యశాఖ, స్వచ్ఛంధ సంస్థల ఆధ్వర్యంలో ఎయిడ్స్‌పై బైక్ జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఈ వ్యాధికి గురైన వారిపై వివిక్ష చూపడకూడదన్నారు. ఎయిడ్స్ అంటు వ్యాధి కాదని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి గణేష్, శాకిర్, మనోహర్ పత్తార్, నందిత, చంద్రశేఖరయ్య, సరోజ, సంధ్య, మఠపతి పాల్గొన్నారు.
కేఎల్‌సీ నూతన
సారథిగా ప్రీతి కోరె
హుబ్లీ: కర్ణాటక లింగాయత్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పదవికి డాక్టర్ ప్రభాకర్ కోరె గుడ్ బై చెప్పారు. ముందుగా డైరెక్టర్ పదవికి నామినేషన్ సమర్పించారు. అయితే ఆ నామినేషన్ పత్రాలను తిరిగి తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సంస్థ డైరెక్టర్ పదవికి బరిలో ఉన్న మహంతేష్ కౌజలిగి, అమిత్ కోరే, డాక్టర్.విశ్వనాథ్ పాటిల్‌తో పాటు 14 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డాక్టర్ ప్రభాకర్ కేరె కుమార్తె ప్రీతి కోరే కేఎల్‌సీ సంస్థ నూతన మహిళ సారథిగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికై న ప్రీతి కోరే పదవి బాధ్యతలను ఎంత మేర సమర్థవంతంగా నిర్వర్తిస్తారో వేచి చూడాల్సిందే.
సౌకర్యాల కల్పనకు చర్యలు
హొసపేటె: ‘గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తాం. రోడ్డు వ్యవస్థ, తాగునీటి సమస్య, రవాణా, విద్యుత్, విద్య సౌకర్యాలు కల్పిస్తాం’ అని విజయనగర జిల్లా కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కూడ్లిగి తాలూకా ఏ.దిబ్బడహళ్లి గ్రామాన్ని చంద్రశేఖరపూర్ గ్రామంతో కలిపే రోడ్డు నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు రోడ్డు పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని తెలిపారు. రోడ్డు పనులను నాణ్యతగా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు గ్రామ పంచాయతీ సభ్యుడు జీఆర్.సిద్దేశ్వర్, జి.మంజునాథ్. జంపల్లి నాగరాజ్ మాజీ అధ్యక్షుడు స్వామి, వీరనగౌడ, నింగప్ప, యజమాన నాగరాజ్, జర్మలి గ్రామ పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రాయచూరు–గిణిగెర రైల్వే పనులు పూర్తి చేయాలి
రాయచూరు–గిణిగెర రైల్వే పనులు పూర్తి చేయాలి
రాయచూరు–గిణిగెర రైల్వే పనులు పూర్తి చేయాలి


