జీవితంపై విరక్తి చెంది యువతి ఆత్మహత్య
హుబ్లీ: జీవితంపై విరక్తి చెంది యువతి ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కలబుర్గి నగరంలోని సిద్దరేశ్వర కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు.. అనుసూయ ఆత్మహత్య చేసుకున్న మహిళ. అత్త కుమారుడు అవినాష్‌ను ప్రేమించి రెండు నెలల క్రితమే వివాహం చేసుకుంది. తోబుట్టువులు ముంబై, బెంగళూరులో ఉంటూ హాయిగా జీవిస్తున్నారు. తోబుట్టువులు నగరంలో భర్తతో హాయిగా కాపురం చేసుకుంటున్నారని బాధపడేది. తాను మాత్రం పల్లెలో ఉండాలా అని అనసూయ మానసికంగా కుంగిపోయేది. భర్తతో ఈ విషయమై గొడవ పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. నగర విశ్వవిద్యాలయ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్లాస్టిక్ కవర్లు
అమ్మితే జరిమానా
రాయచూరు రూరల్: నగర పరిసర ప్రాంతాల్లో గురువారం పలు వ్యాపార దుకాణాలను నగర సభ అధికారులు తనిఖీ చేశారు. నేతాజీ నగర్ ప్రాంతంలోని దుకాణాల్లో విక్రయిస్తున్న ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేశారు. ప్లాస్టిక్ వాడటంవల్ల జరిగే అనర్థాలను వివరించారు. ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని సూచించారు. ప్రజలు ప్లాస్టిక్ కవర్లు వాడకుండా వాటి నిషేధానికి కృషి చేయాలని తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అమ్మితే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర సభ అదికారులు జైపాల్ రెడ్డి, మల్లికార్జున, అమరేష్, వినోద్, ఈరణ్ణ, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
సుభాష్
చంద్రబోస్‌కు నివాళి
రాయచూరు రూరల్: నగరంలోని వెంకటేశ్వర కళాశాలలో శుక్రవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి విద్యార్థులు పూలమాల వేసి నివాళులర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ వీరేష్ రాజగురు మాట్లాడుతూ.. చంద్రబోస్ దేశానికి చేసిన సేవలు అనన్యమన్నారు. అహింస మార్గంలో మాత్రమే స్వాతంత్ర లభించదని చెప్పి.. ఆయుధాలను చేతపడితేనే సాధించగలమనే నినాదాన్ని నేతాజీ లేవనెత్తారని పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకు విద్యార్థులకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో చిదానంద, అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పడిపోయిన కంది ధరలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, కలబుర్గి, యాదగిరి, కొప్పళ తదితర జిల్లాల్లో సాగు చేసిన కంది ధరలు అమాంతం పడిపోయాయి. మార్కెట్‌లో కందులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం ట్రాక్టర్లు, ఎడ్లబండ్లపై వచ్చిన రైతులు జిల్లా అధికారి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కళ్యాణ కర్ణాటకలో కలబుర్గి, రాయచూరు ఏపీఎంసీలో నెల రోజుల్లో క్వింటాకు రూ.1,000 ధర తగ్గిందన్నారు. క్వింటాకు రూ.12,500 మద్దతు ధరలు ప్రకటించాలని సూచించారు. కేంద్రం రూ.1,000, రాష్ట్ర సర్కార్ రూ.1,000 చొప్పున ప్రోత్సాహక ధనం ఇవ్వాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శరణ బసప్ప, సిద్దు, భీమా శంకర్, ఉమాపతి పాటిల్, గుండప్ప, నాగయ్య, మౌనేష, సిద్దమ్మ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కట్టడాల తొలగింపులో అన్యాయం
రాయచూరు రూరల్: నగరంలోని మావిన చెరువు వద్ద అక్రమ కట్టడాల తొలగింపులో అన్యాయం జరిగిందని కర్ణాటక రక్షణ సమితి సంచాలకుడు రాజశేఖర్ ఆరోపించారు. శుక్రవారం నగర సభ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మావిన చెరువు వద్ద ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలను తొలగించడం జరుగుతోందన్నారు. ఇరువైపులా ఆరు అడుగులకు బదులుగా కేవలం అడుగు మాత్రమే తొలగించారన్నారు. ఒక వైపు ఆరు అడుగులు, మరో వైపు అడుగు మాత్రమే తొలగించారని మండిపడ్డారు. అక్రమ కట్టడాలను సమానంగా తొలగించాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
జీవితంపై విరక్తి చెంది యువతి ఆత్మహత్య
జీవితంపై విరక్తి చెంది యువతి ఆత్మహత్య
జీవితంపై విరక్తి చెంది యువతి ఆత్మహత్య


