ఉత్సాహంగా బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు
బళ్లారి అర్బన్: నగరంలోని వాల్మీకి భవన్‌లో జేకే ఫౌండేషన్, ఫిట్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళ్యాణ కర్ణాటక డివిజన్ స్థాయి బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలను సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బళ్లారిలో మునుపెన్నడు లేని విధంగా బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. జీకే క్లాసిస్స్ సీజన్ వన్ టైటిల్ విజేతగా కోప్పల్ శరణప్ప, బళ్లారికి చెందిన జీకే మస్కులర్ బెస్ట్‌గా అబ్దుల్ రహమాన్, జీకే బెస్ట్ ఫోజర్ గోణి స్వామి హోర విజేతగా నిలిచారు. టైటిల్ విజేత కొప్పళ శరణప్పకు జీకే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జీకే స్వామి విజయ్ రూ.51 వేలు అందించారు. బళ్లారి అబ్దుల్ రహమాన్‌కు రూ.15 వేలు, గోణిస్వామి రూ.10 వేలు అందజేశారు. కార్యక్రమంలో ఫిట్‌నెస్ అసోసియేషన్ కార్యదర్శి రాఘవేంద్ర ఠాకూర్, కరాటే కోచ్ కట్టె స్వామి, శివస్వామి, రాజేష్, ఆంధ్రాల్ గోవింద్, మనియప్ప, హరీష్, ప్రసాద్, రత్నయ్య, కళాకారులు వినోద్, శిరీష తదితరులు పాల్గొన్నారు


