మార్చిలో వర్కింగ్ జర్నలిస్టుల సమ్మేళనం
రాయచూరు రూరల్: మార్చి నెలలో 40వ వర్కింగ్ జర్నలిస్టుల సమ్మేళనం బీదర్‌లో నిర్వహిస్తున్నట్లు వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివానంద తగడూరు వెల్లడించారు. గురువారం సాయంత్రం బెంగళూరులో బీదర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఈశ్వర్ ఖండ్రే చేతుల మీదుగా సమ్మేళనానికి సంబంధించిన లోగోను విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీదర్ జిల్లాలోని పాత్రికేయులు పెద్ద ఎత్తున తరలివచ్చి సమ్మేళనం విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. రాష్ట్రం నలుమూలాల నుంచి వచ్చే జర్నలిస్టులకు మౌలిక సౌకర్యాల కల్పనకు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కేకే ఆర్టీసీ మండలి అధ్యక్షుడు పాటిల్, బీదర్ జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు దేవప్ప, తదితరులు పాల్గొన్నారు.


