రైతులకు రుణ మాఫీ చేయాలి
దొడ్డబళ్లాపురం: కందిపంటకు మద్దతు ధర, పంటనష్ట పరిహారం కోరుతూ కలబుర్గిలో రైతులు ధర్నా చేశారు. కలబుర్గి కలెక్టరేట్ ముందు చేరి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరలు లేక, పంటలు నష్టపోయి సమస్యల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదన్నారు. కంది పంటకు క్వింటాల్‌కి రూ.12,500 ఇవ్వాలని, అతివృష్టితో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కంది మీద 50 శాతం పన్ను విధించాలన్నారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ప్రభుత్వం దయతో రైతుల రుణాలను మాఫీ చేయాలని కోరారు.


