హాస్టల్‌లో విద్యార్థి శవం లభ్యం
హుబ్లీ: హుబ్లీలోని ఓ హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి శవం లభ్యమైంది. వివరాలు.. పీయూ కళాశాల విద్యార్థి శవంగా మారడంతో తోటి విద్యార్థులు, ఆ కళాశాల యాజమాన్యం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయాన్ సుంకద(17) అనే విద్యార్థి శవం హుబ్లీలోని బైరిదేవరకొప్ప వద్ద ఉన్న సదరు సన కాలేజీ హాస్టల్‌లో మూడో అంతస్తు కింద దొరికింది. మృతుడు సైన్స్ విభాగం విద్యార్థి అని, కొప్పళ జిల్లా కవలూరుకు చెందినవాడని సమాచారం. ప్రస్తుతం శవాన్ని హుబ్లీ కిమ్స్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేపట్టినట్లు తెలిసింది.
సంఘం బలోపేతానికి సూచన
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో అంజుమన్ ఏ ముస్లిం సంఘాన్ని బలోపేతం చేయాలని అన్సరుద్దీన్ సూచించారు. ఆదివారం లింగసూగూరు తాలూకా మరగంట్నాళ్ మసీదులో నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేసి మాట్లాడారు. కమిటీ ద్వారా పేద మైనార్టీలకు ప్రభుత్వం నుంచి లభించే సంక్షేమ పథకాలను వారికి అందించాలన్నారు. పిల్లలను పాఠశాలకు పంపి విద్యాబుద్ధులు నేర్పాలన్నారు. అధ్యక్షుడు దాదాపీర్, పదాధికారులు మైబూసాబ్, నూర్, హసన్ సాబ్, మోదిన్, బాషా, మహ్మద్, గౌస్ మియ్యా, షరీఫ్, కాశీంసాబ్, ఖాజాసాబ్‌లున్నారు.
వైభవంగా సంగమేశ్వర ఉత్సవాలు
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లా వడగేర తాలూకాలోని కృష్ణవేణి, భీమ సంగమంలో సంగమేశ్వర జాతర, ఉత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. సంగమ కరుణేశ్వర స్వామీజీ ఆధ్వర్యంలో పల్లకీ సేవలు, రథోత్సవాలను జరిపారు. తెలంగాణ పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి భార్య లలిత హాజరయ్యారు. రథోత్సవంలో ఈశమ్మ, ఈశప్ప, శరభయ్య శాస్త్రి, శివరుద్రయ్య శాస్త్రి, రాజప్ప గౌడ, వెంకటరెడ్డిగౌడ, సైదణ్ణ, శివపుర గురురాజ్, మల్లు, మౌనేష్‌లున్నారు.
హాస్టల్‌లో విద్యార్థి శవం లభ్యం


