22, 23 తేదీల్లో బాడీ బిల్డింగ్ పోటీలు
బళ్లారిఅర్బన్: నగరంలోని వాల్మీకి భవన్‌లో ఈ నెల 22, 23 తేదీల్లో కళ్యాణ కర్ణాటక జిల్లాల మహిళలు, పురుషులకు దేహదారుఢ్య పోటీలు నిర్వహిస్తున్నట్లు జేకే ఫౌండేషన్ నిర్వాహకులు జీకే స్వామి తెలిపారు. సోమవారం పత్రికా భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ పోటీలను సుమారు 8 విభాగాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. 22వ తేదీన బాడీ బిల్డింగ్ పోటీలు, 23న పవర్ లిఫ్టింగ్, మెన్స్ ఫిజిక్ పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్న వారు పోటీల్లో పాల్గొనేందుకు రూ.500 చెల్లించి పేరు నమోదు చేసుకోవాలన్నారు. రఘు, జావిద్, చాంద్, బళ్లారికి చెందిన జిమ్‌ల యజమానులు పాల్గొన్నారు.
దేవదాసి మహిళల ధర్నా
రాయచూరు రూరల్: దేవదాసి మహిళల జనాభాపై పునః సమీక్ష జరపాలని రాష్ట్ర దేవదాసి మహిళల వేదిక డిమాండ్ చేసింది. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు పద్మ మాట్లాడారు. 1982కు ముందు పుట్టిన వారిని మాత్రమే సర్వే చేశారన్నారు. ఆ తర్వాత పుట్టిన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడానికి అధికారులు నిరాసక్తిని చూపుతున్నారని ఆరోపించారు. దేవదాసి పద్ధతి నిషేధ చట్టం– 2025 ఆధారంగా తాలూకా, జిల్లా, గ్రామీణ స్థాయిలో అధికారులు దేవదాసి మహిళల జనాభా పునః సమీక్ష చేయాలనిని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.


