జ్ఞాన సముపార్జనకు పుస్తకాలు దోహదం
రాయచూరు రూరల్: జ్ఞానసముపార్జనకు పుస్తకాలు దోహదపడతాయని రాయచూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద పేర్కొన్నారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరం ఆవరణలో పుస్తక సంతె కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. మనిషి జ్ఞాన వికాసానికి పుస్తకాలు ఆప్తమిత్రలా పని చేస్తాయన్నారు. నేటి యువత పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలన్నారు. పుస్తక జ్ఞానం లేకపోతే చీకటి ప్రపంచంలో నలిగి పోవాల్సిందేనన్నారు. కవులు అయ్యప్ప హుడా, బాబు భండారిగల్, చిదానంద సాలి, వెంకటేష్, ఈరణ్ణ, జాన్ వెస్లీ, మారుతి, రేఖాలున్నారు.


