కార్మిక వ్యతిరేక వైఖరి తగదు
రాయచూరు రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(మనరేగ) పేరును కేంద్ర ప్రభుత్వం మార్చివేసి పేదల కడుపు కొట్టిందని సీపీఐ(ఎంఎల్) ఆరోపించింది. సోమవారం రాయచూరు తాలూకా అరళిబెంచిలో మనరేగ కార్మికులు చేస్తున్న పనుల వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు వీరేష్ మాట్లాడారు. మనరేగ పథకం పేరును యథాప్రకారం కొనసాగించాలన్నారు. గతంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులను ఖర్చు పెట్టేవారన్నారు. ప్రస్తుతం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులతో పనులు చేయించాల్సి వస్తుందన్నారు. ఆందోళనలో నాగేంద్ర, నరసప్ప, ఈరణ్ణ, తాయప్ప, యల్లప్ప, ఆంజనేయులు, వెంకటేష్‌లున్నారు.


