లారీలోని 40 బైక్‌ల దగ్ధం
బళ్లారిఅర్బన్: నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనంతపురం రోడ్డులో బైక్‌ల లోడ్‌తో ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగి 40 బైక్‌లు దగ్ధం అయ్యాయి. చైన్నె నుంచి బళ్లారికి తీసుకొచ్చిన 40 బైక్‌లను షోరూమ్‌కి తరలించాల్సి ఉండగా రాత్రి అనంతపురం రోడ్డులో ఎంజీ సమీపంలోని యమహా షోరూమ్ వద్ద ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగి కాలి పోయాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేశారు. అప్పటికే లారీ సగం మేరకు కాలిపోయింది.
కల్యాణ కర్ణాటకలో
ఐదు రోజులు చలి పంజా
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటక(క–క)లో ఐదు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉండనుంది. ఈనేపథ్యంలో ప్రజలు నెల రోజులకు ముందే భోగి మంటలకు శ్రీకారం చుట్టారు. సోమవారం బీదర్ జిల్లాలో 6.5 డిగ్రీలు, విజయపురలో 7.5 డిగ్రీలు, రాయచూరులో 10 డిగ్రీలు, కలబుర్గిలో 11 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత రెండు రోజుల నుంచి చలి తీవ్రత అధికమైంది. ఉదయం 9 గంటలు దాటినా చలి వేస్తూనే ఉంది. లింగసూగూరు రోడ్డులో మంచు పూర్తిగా కమ్ముకుంది.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో ప్రభుత్వ కన్నడ ప్రాథమిక పాఠశాలలను సంరక్షించి బలపరచాలని ఏఐడీవైఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం రాయచూరు తాలూకా అరోలిలో సంతకాల సేకరణను ఏఐడీవైఓ సంచాలకులు కృష్ణా నాయక్ ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కర్ణాటక పబ్లిక్ పాఠశాలలను నెలకొల్పి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మూసివేత దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ సంతకాల సేకరణ చేపట్టారు.
పది ఫలితాలు
మెరుగు పరచాలి
రాయచూరు రూరల్ : జిల్లాలో పదో తరగతి ఫలితాలను మెరుగు పరచాలని తాలూకా విద్యా శాఖాధికారి ఈరణ్ణ కోస్గి సూచించారు. సోమవారం గాణదాళలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ సబ్జెక్టులపై విద్యార్థులకు విద్యా బోధన చేయాలన్నారు. పాఠ్యాంశాల ఆధారంగా ఉపాధ్యాయులు ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు ముందుండాలన్నారు. విద్యార్థులకు పరీక్ష మండలి విడుదల చేసిన ప్రశ్నా పత్రికలను పరిచయం చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పరీక్ష వేళల సమయాలను వివరించి పరీక్షలకు సిద్ధం అయ్యేలా సమావేశాలు నిర్వహించాలన్నారు.
మధ్యవర్తిత్వంతో
ఆరు జంటలు ఏకం
హొసపేటె: విడాకుల కోసం దాఖలు చేసిన ఆరు జంటలను జాతీయ లోక్ అదాలత్‌లో మధ్యవర్తిత్వం ద్వారా ఏకం చేశారు. కర్ణాటక రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఆదేశాల మేరకు తాలూకా న్యాయ సేవల కమిటీ హగరిబొమ్మనహళ్లి కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా చెక్ బౌన్స్ కేసులు, విభజన దావాలు, ఇతర కేసుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పార్టీలు, న్యాయవాదుల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించారు. సీనియర్ సివిల్ జడ్జి డీకే.మధుసూదన్ తన కోర్టులో 1141 కేసుల్లో 90 కేసులు పరిష్కరించారు. మొత్తం రూ.3,58,37,779ల పరిహారం అందించారు. సివిల్ జడ్జి సయ్యద్ మొహిద్దీన్ కోర్టులో 1523 కేసులు గుర్తించగా, 460 కేసులు పరిష్కరించారు. అదనంగా 1229 ఫ్రీ లిటిగేషన్ కేసుల్లో 48 కేసులు పరిష్కరించి మొత్తం రూ.41,62,642 పరిహారం అందించారు.
లారీలోని 40 బైక్‌ల దగ్ధం
లారీలోని 40 బైక్‌ల దగ్ధం
లారీలోని 40 బైక్‌ల దగ్ధం
లారీలోని 40 బైక్‌ల దగ్ధం


