బొగ్గు చోరీ బాధ్యులపై చర్యలు చేపట్టండి
రాయచూరు రూరల్: యరమరస్ థర్మల్ విద్యుత్ కేంద్రం(వైటీపీఎస్)లో బొగ్గు అక్రమంగా దొంగతనం అవుతోందని, అధికారులు, ఇంజినీర్లు భాగస్వాములని, అలాంటి అధికారులను సస్పెండ్ చేయాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మారుతి మాట్లాడారు. రాయచూరు నుంచి యరమరస్ వరకు రైల్వే లైన్ల గుండా వ్యాగన్లతో వెళ్లే రేకులను అన్‌లోడ్ చేసి మిగిలిన బొగ్గును యరమరాస్ రైల్వే స్టేషన్‌లో గంటసేపు రైలు నిలిపి బొగ్గును అక్రమంగా విక్రయాలు చేశారన్నారు. బొగ్గును వైటీపీఎస్ ఇంజినీర్లు హరీష్, చంద్రశేఖర్ సబ్ కాంట్రాక్ట్ పొందిన పవర్ మేక్ సూపర్‌వైజర్ హరికృష్ణ, మేనేజర్ సురేంద్రనాథ్, స్టేషన్ మాస్టర్ సర్కార్, వ్యాగన్ల క్లీనింగ్ సిబ్బంది, గురు రాఘవేంద్ర ఎంటర్‌ప్రైజస్ శేషగిరి కలిసి అక్రమంగా వైటీపీఎస్‌కు తరలాల్సిన బొగ్గును దొంగతనంగా ఇతర ప్రాంతాలకు తరలించిన అధికారులు, సబ్ కాంట్రాక్టర్, గురు రాఘవేంద్ర ఎంటర్‌ప్రైజస్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని కోరుతూ జిల్లాధికారి నితీష్‌కు వినతిపత్రం సమర్పించారు.


