సమాచార శాఖాధికారికి సత్కారం
హొసపేటె: విలేకరులు, సమాచార, పౌర సంబంధాల శాఖ ఒకే నాణేనికి రెండు ముఖాలని విజయనగర జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ బి.ధనుంజయ తెలిపారు. కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన జర్నలిస్టులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విజయనగర జిల్లాలో జర్నలిస్టులు, సమాచార శాఖకు మధ్య మెరుగైన సంబంధాలున్నాయన్నారు. జిల్లాలోని జర్నలిస్టులు బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ఇటీవల జర్నలిస్టుల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారన్నారు. అనంతరం అసోసియేషన్ తరఫున జిల్లా సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ ధనుంజయను సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కే.లక్ష్మణ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు పూజారి వెంకోబ నాయక తదితరులు పాల్గొన్నారు.


