అంబేడ్కర్ భవన్ పనులకు భూమిపూజ
కోలారు : నగరంలోని స్వర్ణభవనం ఆవరణలో ఉన్న 8.20 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ స్మారక భవన పరిశోధన కేంద్రం, జ్ఞాన కేంద్రం నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే రూపా శశిధర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహా మానవతా వాది అంబేడ్కర్ కాలుమోపిన స్థలంలో మనం జీవిస్తుండడం మనందరి అదృష్టమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విశేష నిధుల నుంచి రూ.9 కోట్లు, ఇతర నిధులు కలిపి మొత్తం రూ.15 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే ఆదర్శంగా అంబేడ్కర్ స్మారక భవన్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ భవనం పోటీ పరీక్షలను రాసే విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. మాజీ నగరాభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు జయపాల్, మాజీ జెడ్పీ సభ్యుడు ఆము లక్ష్మీనారాయణ, నగరసభ మాజీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ దయాశంకర్ తదితరులు పాల్గొన్నారు.


