కళాశాలకు వాటర్ ఫిల్టర్ వితరణ
కోలారు : తాలూకాలోని వేమగల్ పారిశ్రామికవాడలోని లైకో కంపెనీ సీఎస్‌ఆర్ నిధుల నుంచి నగరంలోని బాలుర ప్రభుత్వ కళాశాలకు రక్షిత తాగునీటి ఫిల్టర్‌ను అందించారు. కంపెనీ మేనేజర్ డీఎం మహదేవ్ మాట్లాడుతూ కంపెనీల నుంచి వచ్చే సీఎస్‌ఆర్ నిధులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉత్తమ విద్యాభ్యాసం చేయాలన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో జిల్లాలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు. ప్రభుత్వ కళాశాలలు, విద్యా సంస్థల్లో మౌలిక సౌకర్యాలను కల్పించడానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ సీనియర్ మేనేజర్ శాలిని మయాంక్ తదితరులు పాల్గొన్నారు.


