విద్యార్థులకు చట్టపరిజ్ఞానం అవసరం
రాయచూరు రూరల్: సమాజంలో విద్యార్థులకు చట్టపరిజ్ఞానం అవసరమని మిషన్ శక్తి పథకం అధికారి బావాసలి అభిప్రాయ పడ్డారు. సోమవారం సిరవార తాలూకా నవలకల్ ఇందిరాగాంధీ వసతి పాఠశాలలో జిల్లా యంత్రాంగం, జెడ్పీ, జిల్లా న్యాయ సేవా ప్రాధికార, మహిళా శిశు సంక్షేమ, విద్యా, అటవీ, మహిళా సబలీకరణ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. లైంగిక దాడుల నుంచి మహిళల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సాంఘీక దురాచారాలైన బాల్య వివాహాలు, బాల కార్మిక పద్ధతి, దేవదాసి పద్ధతి వంటి వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో లింగరాజ్, నాగమ్మలున్నారు.
స్కౌట్స్ గైడ్స్‌తో దేశభక్తి వృద్ధి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థుల్లో స్కౌట్స్ గైడ్స్‌తో దేశాభిమానం, సౌభ్రాతృత్వం, మానవీయ విలువలు, క్రమశిక్షణ అలవడతాయని తహసీల్దార్ సురేష్ వర్మ అన్నారు. సోమవారం భారత్ స్కౌట్స్ గైడ్స్ ఆధ్వర్యంలో గీత గాయన పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకలోని ఏడు జిల్లాల స్కౌట్స్ గైడ్స్, కబ్స్, బుల్ బుల్, రేంజర్స్, రోవర్స్ విద్యార్థులు గీత గాయన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. రామచంద్రప్ప, రూప, అంబన్న, కిరణ్ కుమార్, సోమశేఖర్, బసవరాజ్, హన్మంతప్ప, శాంతమ్మ, నరసింహ, సిద్దలింగేష్, నాగప్ప, మల్లయ్య, శరణప్ప, విశ్వనాథ్‌లున్నారు.
వైభవంగా వీరభద్రేశ్వర రథోత్సవం
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా హట్టిలో ఆదివారం సాయంత్రం వీరభద్రేశ్వర జాతర, రథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరిగాయి.
పారిశ్రామిక కాలుష్యంపై గ్రామస్తుల పోరాటం
రాయచూరు రూరల్: నేడు వింత రోగాలతో మానవుడు మరణిస్తుంటే ప్రభుత్వం పనికి రాని పరిశ్రమలను అంటగట్టి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, ప్రాణాంతక వ్యాధులు సోకేందుకు కారణమవుతున్న పరిశ్రమలు తమకు వద్దు అంటూ కొప్పళ జిల్లా ప్రజలు పోరాటానికి నడుం కట్టి ముక్త కంఠంతో ఆందోళనకు దిగారు. గత 46 రోజుల నుంచి కొప్పళ జిల్లా బచావో సమితి ఆధ్వర్యంలో బల్డోటా, కిర్లోస్కర్, కళ్యాణి స్టీల్, ముక్కుంది సిమి, ఏక్ష్‌ండియా వంటి పరిశ్రమల వల్ల 15 గ్రామాల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందన్నారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల తుంగభద్ర జలాశయం పూర్తిగా కలుషిత రసాయనాలతో మలినం అవుతోందన్నారు.
జనవరి 24న కొత్త పార్టీ ఆవిర్భావం
రాయచూరు రూరల్: కర్ణాటకలోని కలబుర్గిలో జనవరి 24న కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందని మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం వెల్లడించారు. ఆదివారం సాయంత్రం కలబుర్గిలోని మొఘల్ గార్డెన్స్‌లో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కన్నడ నాడు కోసం రాయచూరు, విజయపుర, బీదర్, యాదగిరి జిల్లాల్లో ప్రచారం చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటే అన్నారు. పేదలు, శ్రామికులు, కార్మికులు, రైతులకు మూడు శాతం వడ్డీతో రుణాలిస్తామన్నారు. దళితుల కోసం రూ.30 వేల కోట్ల నిధులను ఇతరత్రాలకు ఉపయోగించారని ఆరోపించారు. కార్యక్రమంలో కోడిహళ్లి చంద్రశేఖర్, మూర్తి, గోపినాథ్, మునియప్ప, మోహన్ రాజ్, వాసు తదితరులున్నారు.
హెల్మెట్ లేని వారికి జరిమానా
కోలారు : బేతమంగల పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాల్లో తిరుగుతున్న వారికి పోలీసులు జరిమానా విధించారు. ఈనెల 8వ తేదీ నుంచి కేజీఎఫ్ పోలీస్ జిల్లా పరిధిలో ద్విచక్రవాహనాల్లో తిరిగే వారికి హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని ఆదేశించారు. నియమాలను ఉల్లంఘించి హెల్మెట్ లేకుండా తిరుగుతున్న వారిని అడ్డగించి పోలీసులు జరిమానా విధించారు. ఎస్‌ఐ గురురాజ చింతకల్ నేతృత్వంలో పోలీసులు ద్విచక్రవాహనాలను అడ్డుకుని హెల్మెట్ లేని వారికి జరిమానా కొరడా ఝళిపించారు.
విద్యార్థులకు చట్టపరిజ్ఞానం అవసరం
విద్యార్థులకు చట్టపరిజ్ఞానం అవసరం
విద్యార్థులకు చట్టపరిజ్ఞానం అవసరం


