ఎయిడ్స్ మహమ్మారిపై జాగృతి
సోమవారం బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఎయిడ్స్ జాగృతి ర్యాలీ
ఎయిడ్స్ చిహ్నంలో ఏర్పడిన విదార్థులు
బొమ్మనహళ్లి: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పట్టణంలో ఎయిడ్స్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు ముఖానికి వినూత్నంగా అలంకరించుకుని ర్యాలీలో పాల్గొన్నారు. పలు సర్కిళ్ల గుండా ర్యాలీ సాగింది.
అవగాహన ముఖ్యం
చింతామణి: నేటి యువత ఎయిడ్స్ పట్ల జాగృతి కలిగి ఉండాలని లాయర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట లాయర్ల సంఘం, ఆరోగ్యశాఖ ద్వారా ఎయిడ్స్ వ్యతిరేక ర్యాలీ సాగింది. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తాలూకా ఆరోగ్యాధికారి రామచంద్రారెడ్డి, వకీళ్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఎయిడ్స్ మహమ్మారిపై జాగృతి


