పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
కేజీఎఫ్: చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని బీఈఎంఎల్ కేజీఎఫ్ కాంప్లెక్స్ ప్రముఖుడు జి.యోగానంద అన్నారు. నగరంలోని బెమెల్ కేజీఎఫ్ కాంప్లెక్స్‌లో స్వచ్ఛతాపక్వాడా కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్వచ్ఛత అనేది కేవలం పని కాదని.. అది వ్యక్తిగత బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ తమ స్నేహితులు, ఇంటి పరిసరాల్లో ఉన్నవారికి శుభ్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవ సంపన్మూల విభాగం ప్రముఖుడు నీనాసింగ్, బీఈఎంఓజీ అధ్యక్షుడు సుబ్రమణి, రామచంద్రారెడ్డి, తిరుముగం, పదాధికారులు, కార్య నిర్వాహకులు పాల్గొన్నారు.


