యాదగిరిలో మహిళపై హత్యాయత్నం
రాయచూరు రూరల్: యాదగిరి పట్టణంలో మహిళపై బుధవారం హత్యాయత్నం జరిగింది. యాదగిరి సాంఘీక సంక్షేమ శాఖలో ఎఫ్‌డీఏగా విధులు నిర్వహిస్తున్న అంజలిపై పాత కక్షలతో ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నగరంలోని తన ఇంటి నుంచి కారులో కార్యాలయానికి వస్తున్న సమయంలో గ్రీన్ సిటీ వద్ద కారును అడ్డుకొన్న దుండగులు మారణాయుధాలతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న అంజలిని హుటాహుటిన యాదగిరి జిల్లా ఆస్పత్రిలో చేర్చించారు. అంజలి గతంలో కలబుర్గి జిల్లా శహాబాద్ నగరసభ అధ్యక్షురాలిగా విధులు నిర్వహించారు. ప్రభుత్వ కోటాలో ఉద్యోగం రావడంతో ఆమె యాదగిరిలో నివాసం ఉన్నారు. 2019లో భర్త గిరీష్‌పై హత్యాయత్నం విఫలం కాగా 2022లో శంకర్ సహచరులు శహాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గిరీష్‌ను హత్య చేశారు. పాత కక్షల కారణంగా అంజలిని హత్య చేయడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. అంజలి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందగానే ఘటనా స్థలాన్ని ఎస్పీ పృథ్విశంకర్ పరిశీలించారు.
గ్రామాలకు అదనపు బస్సులు నడపాలి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాలకు అదనపు బస్సులు నడపాలని వివిధ గ్రామాల ప్రజలు ఆర్టీసీ అధికారులకు తమ మొరను వినిపించారు. గురువారం ఆర్టీసీ డివిజనల్ కార్యాలయం వద్ద ఏఐడీవైఓ సంఘం సంచాలకుడు అయ్యాళప్ప మాట్లాడారు. తాలూకాలోని గిల్లేసూగూరు, హెంబరాళ గ్రామాల ప్రజలు, విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి రాయచూరుకు వెళ్ల్లడానికి ఒక్క బస్ మాత్రమే నడుస్తోందన్నారు. కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఆరు గ్రామాల ప్రజలు ఒకే బస్సుపై ఆధారపడుతున్నారన్నారు. అదనపు బస్సులను నడపాలని కోరుతూ డివిజనల్ కంట్రోలర్‌కు వినతిపత్రం సమర్పించారు.
రేపు ఆరోగ్య పరీక్ష శిబిరం
రాయచూరు రూరల్: రాయచూరు ఆదికవి మహర్షి విశ్వ విద్యాలయంలో ఈనెల 15న ఆరోగ్య పరీక్ష శిబిరం, సాక్షరత ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు శశిధర్ శెట్టి పేర్కొన్నారు. ఆయన గురువారం జిల్లా న్యాయాలయ భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో దేవదాసి మహిళల జనాభాపై సర్వే చేపట్టారని గుర్తు చేశారు. దేవదాసి పద్ధతిని నిర్మూలించడానికి ప్రత్యేక ఉపన్యాసం ఏర్పాటు చేశారన్నారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు చేపడతారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొంటారన్నారు. న్యాయమూర్తులు మారుతి బగాడే, స్వాతిక్, నలపాడ్, బాల సుబ్రమణ్యంలున్నారు.
తెల్ల కాగితాలపై
సంతకాలు పెట్టించారు
రాయచూరు రూరల్: సదర్ బజార్ మహిళా పోలీస్ స్టేషన్ మహిళా పోలీసులు తనతో తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించారని బాధితుడు నవీన్ కుమార్ ఆరోపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం రాత్రి వేళ బసవేశ్వర కాలనీ నివాసంలో నిద్రిస్తుండగా సదర బజార్ మహిళా పోలీస్ స్టేషన్ మహిళా పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు పిలుచుకెళ్లారన్నారు. అక్కడ తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారన్నారు. చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం కొనసాగిస్తున్న తనను పోలీసులు ఠాణాకు తీసుకెళ్లారన్నారు. తన ఆస్తి కోసం లక్ష్మి తండ్రి హన్మంతప్ప, భర్త రాహుల్‌లు కలిసి రెండవ భార్య అంటూ ఆమెతో జీవనం చేయాలని ఒత్తిడి తెచ్చారన్నారు. ఈ విషయంలో మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు, తనకు అన్యాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
దానమ్మ దేవికి ఊయల సేవ
రాయచూరు రూరల్ : సమాజంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీక దానమ్మ దేవి ఆలయం అని సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య అభిప్రాయ పడ్డారు. బుధవారం రాత్రి నీలకంఠేశ్వర ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో దేవీ పురాణ ప్రవచన కార్యక్రమంలో భక్తులనుద్దేశించి ప్రసంగించారు. నేడు మహిళలు, పిల్లలకు సనాతన సంస్కృతి, ఆచార విచారాల గురించి తెలియజేయాలన్నారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు జరిపారు. కార్యక్రమంలో జగదీశ్వర శాస్త్రి, అమరేగౌడ, లింగన్నలున్నారు.
యాదగిరిలో మహిళపై హత్యాయత్నం
యాదగిరిలో మహిళపై హత్యాయత్నం
యాదగిరిలో మహిళపై హత్యాయత్నం
యాదగిరిలో మహిళపై హత్యాయత్నం


