3 కేసులు నమోదు
ఖైదీలు మొబైల్ వాడడం, టీవీ చూడడం పై పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు, సైబర్ ఠాణాలో మరో కేసు నమోదైంది. అత్యాచార కేసు దోషి ఉమేశ్‌రెడ్డి, ఐసిస్ టెర్రరిస్ట్ జుహద్ షమీల్ షకీల్ మన్నా , గోల్డ్‌స్మగ్లర్ తరుణ్ కొండూరు మొబైల్‌ను వినియోగించారు. దీనిపై జైలు అధికారులు ఫిర్యాదులు చేశారు. త్వరలో నిందితులను పోలీసులు విచారించే అవకాశం ఉంది.
ఎన్‌ఐఏ ఆరా
ఈ వ్యవహారంలో ఎన్‌ఐఏ అదికారులు ఎంట్రీ అయ్యారు. సీసీబీ కార్యాలయానికి వచ్చిన ఎన్‌ఐఏ జైలులో ఉగ్రవాదులు ఉపయోగించిన మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారా, ఇదంతా ఎప్పుడు జరిగిందీ? అనే సమాచారం రాబట్టారు.


