
విదేశీ వద్దు.. స్వదేశీ ముద్దు
హొసపేటె: సదృఢ భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ విదేశీ ఉత్పత్తులను బహిష్కరించాలి, స్వదేశీ ఉత్పత్తులనే ఉపయోగించాలని బీజేపీ రాష్ట్ర శాఖ కన్వీనర్ జీఎస్.ప్రశాంత్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని జ్ఞానభారతి కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన స్వావలంబిత భారతదేశం, మోదీ ప్రభుత్వ నుంచి జీఎస్‌టీ తగ్గింపు బహుమతి అనే సంభాషణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాలకు మద్దతు ఇవ్వడంతో పాటు భారతదేశంతో సహా అనేక దేశాల ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను విధించడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి ప్రతిస్పందిస్తూ మనం ఒక గుణపాఠం నేర్పాలి, స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడాలి. దసరా కానుకగా మోదీ ప్రభుత్వం ధరలను తగ్గించి మధ్య తరగతికి ప్రయోజనం చేకూర్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశీయ ఉత్పత్తులను ఉపయోగించండి
బీజేపీ రాష్ట్ర శాఖ కన్వీనర్ ప్రశాంత్ పిలుపు