కృష్ణరాజపురం: రూ.10 లక్షల అసలైన నోట్లు ఇస్తే రూ.30 లక్షల నకిలీ నోట్లు ఇస్తామని ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసగిస్తున్న తమిళనాడు తిరునైల్వేలి ముఠాను బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. వివరాలు.. మీరు అసలు నోట్లను ఇస్తే, అంతకు మూడు రెట్లు అధికంగా నకిలీ డబ్బులను ఇస్తామని చెప్పి ఈ ముఠా మోసం చేసేది. తమిళనాడులో చురుకుగా ఉన్న ఈ ముఠా బెంగళూరులో కూడా సంచరిస్తున్నట్లు తెలిసి జయనగర పోలీసులు రంగంలోకి దిగారు. ఓ చోట ఇలాగే మోసం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా రాహేశ్వరన్, మిరాయ్ ముయిద్దీన్, షేక్ మహ్మద్ అనే ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సూట్‌కేసును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.500 నోట్ల కట్టలు లభించాయి. కట్ట పైన, కింద కొన్ని అసలు నోట్లను ఉంచి మధ్యలో తెల్లకాగితాలను సర్దారు. మిగతా వారు తప్పించుకొని పారిపోగా గాలింపు చేపట్టారు.
పట్టుబడిన నిందితులు వీరే
బెంగళూరులో మోసకారి ముఠా అరెస్టు
నకిలీ నోట్లు.. అసలుకు మూడు రెట్లు
నకిలీ నోట్లు.. అసలుకు మూడు రెట్లు
నకిలీ నోట్లు.. అసలుకు మూడు రెట్లు