
సొంతూర్లో దీపావళి
టపాసుల బాక్సుతో బాలుడు
దీపావళి పండుగ సందర్బంగా విబిన్నరకాలు టపాసులు చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్సీ టపాసులు ఈసారి అదికంగా మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఏటా మాదిరిగానే బెంగళూరు– తమిళనాడు సరిహద్దులోని హొసూరు రోడ్డులో అత్తిబెలె, సూర్యనగర మార్గంలో రోడ్డుపక్కన వందలాది టపాసుల దుకాణాలు వెలిశాయి. చిత్ర విచిత్రమైన ఆకారాల్లోని టపాసులు ఇక్కడ అమ్మకానికి ఉంచారు. తమిళనాడు నుంచి టోకుగా తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు, ఎక్కువ రకాలు దొరుకుతాయని పలు జిల్లాల నుంచి వచ్చి టపాసులు కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు తెలిపారు. రాష్ట్రంలో వివిధ నగరాల్లో దీపావళి ప్రమిదలు, లాంతర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
బెంగళూరు మెజెస్టిక్ బస్టాండులో రద్దీ దృశ్యాలు
పండుగకు ఎలాగైనా ఊరికి చేరాలి
బనశంకరి: దీపావళి పండుగ, అది కూడా వీకెండ్‌తో పాటు కలిసి రావడంతో బెంగళూరువాసులు సొంతూళ్లకు క్యూ కట్టారు. బంధుమిత్రుల మధ్య టపాసులతో సందడిగా గడపాలని ప్రయాణమయ్యారు. దీంతో సిలికాన్ సిటీ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఉద్యోగం, చదువు, వ్యాపారాలతో నగరంలో ఉంటున్న లక్షలాది మంది సొంత ఊర్ల బాటపట్టారు. నగరం నుంచి శివార్ల వరకూ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. శని, ఆదివారం సెలవు, సోమవారం దీపావళి కావడంతో మూడురోజులు స్వగ్రామంలో గడపాలని నిర్ణయించుకున్నారు.
అన్ని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో
శుక్రవారం రాత్రి నుంచి మెజెస్టిక్ బస్టాండు, రైల్వేస్టేషన్ వద్ద కిటకిటలాడింది. శాంతినగర బస్టాండు, యశవంతపుర రైల్వేస్టేషన్‌తో పాటు వివిధ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోనూ విపరీతంగా రద్దీ నెలకొంది. కేఎస్ ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో చోటు దొరకలేదు. ప్రైవేటు ట్రావెల్స్‌లో టికెట్ రేట్లను రెండు మూడు రెట్లు పెంచేసి దోచుకుంటున్నారని ఆరోపణలొచ్చాయి. హోసూరు రోడ్డు, మైసూరు రోడ్డు, తుమకూరు రోడ్డు, బళ్లారి రోడ్లలో కిలోమీటర్ల కొద్దీ కార్లు, బస్సులు బారులు తీరాయి. లక్షలాది మంది కార్లు, ద్విచక్ర వాహనాల్లో బయలుదేరడంతో మధ్యలో వర్షం వచ్చి గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. సజావుగా వాహనాలు సంచారానికి ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించారు. రైల్వే స్టేషన్, బీఎంటీసీ, కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్లలో పోలీసు భద్రత పెరిగింది.
బెంగళూరు నుంచి లక్షలాది మంది పయనం
రహదారులన్నీ కిటకిట
రాష్ట్రంలో పండుగ సందడి
బిహార్ కూలీలు సైతం
దీపావళి పండుగకు బెంగళూరులోని లక్షలాది మంది బిహారీ వలస కార్మికులు కుటుంబాలతో సహా బయలుదేరారు. దీంతో మెజెస్టిక్ కేఎస్‌ఆర్, యశవంతపుర రైల్వేస్టేషన్లలో తీవ్ర రద్దీ ఏర్పడింది. నవంబరు 6 నుంచి 11 వరకు బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఓటు వేయడానికి కూడా ఎక్కువమంది పయనమయ్యారు.

సొంతూర్లో దీపావళి

సొంతూర్లో దీపావళి

సొంతూర్లో దీపావళి

సొంతూర్లో దీపావళి