
రౌడీ పులి పట్టివేత
మైసూరు: రైతుపై దాడి చేసిన పులిని అటవీ సిబ్బంది పట్టుకున్నారు. జిల్లాలోని సరగూరు తాలూకా బండీపుర అభయారణ్యం పరిధిలోని బడగలపుర గ్రామంలో పత్తి చేనులో ఉన్న రైతు మహదేవగౌడపై దాడి చేసి కళ్లు పీకేసి, తీవ్రంగా గాయపరచిన పెద్ద పులి ఉదంతం తెలిసిందే. గురువారంనాడు ఈ దాడి జరిగింది. క్షతగాత్రున్ని మైసూరు అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమీప యడియాళ వలయంలో పెంపుడు ఏనుగుల సహాయంతో కార్యాచరణ జరిపి పులిని గుర్తించారు. దానికి మత్తు సూది కొట్టి బంధించారు. దీంతో గ్రామస్తులు హమ్మయ్య అనుకున్నారు. రౌడీ పులిని బోనులో బంధించి తరలించారు. పులిని చూసేందుకు జనం భారీగా గుమికూడారు.