
బెంగళూరులో భారీ వర్షం
బెంగళూరులో.. వర్షంలో వెళ్తున్న ఆటో.. బన్నేరుఘట్ట రోడ్డులో వాననీరు
బనశంకరి: బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి బెంగళూరు నగరంలో పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసి రోడ్లు జలమయం కాగా ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. దీంతో జనం వీకెండ్ సంతోషానికి ఆటంకం ఏర్పడింది. మెజస్టిక్, కార్పొరేషన్, మల్లేశ్వరం, యశవంతపుర, యలహంక, హెబ్బాల, శాంతినగర, కోరమంగల, బొమ్మనహళ్లి, జయనగర, మైసూరురోడ్డు, నాయండహళ్లి, కెంగేరి, బన్నేరుఘట్టరోడ్డు, కృష్ణరాజపురం, మారతహళ్లి, మహదేవపుర, హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్, మడివాళ, విజయనగర, బసవనగుడి, జేపీ.నగర, ఉత్తరహళ్లి, బనశంకరి , బీటీఎం లేఔట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పండుగకు ఊళ్లకు వెళ్లేవారు కార్లు, సొంత వాహనాల్లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. బెంగళూరు– రూరల్‌తో పాటు పలు జిల్లాల్లో బారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

బెంగళూరులో భారీ వర్షం