
కొండ కోనలు దాటుకుని..
యశవంతపుర: దీపావళి పర్వదినాల సందర్భంగా కాఫీనాడు చిక్కమగళూరు శక్తిదేవతగా పేరుగాంటిన దేవీరమ్మ దర్శనం కోసం భక్త కోటి తరలివచ్చింది. దట్టమైన అడవుల్లో ముళ్లయ్యనగిరి ప్రాంతంలో సముద్ర మట్టానికి 3800 అడుగుల ఎత్తులో కొండపై వెలసిన అమ్మవారి ఆలయానికి ఆదివారం ఉదయం నుంచి భక్తుల రాక మొదలైంది. వేలాది మంది ఎన్నో ప్రయాసలకోర్చి కొండను ఎక్కి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్య మధ్యలో జోరువాన వచ్చినా తడుస్తూనే భక్తులు కొండను ఎక్కారు. ఆది, సోమవారం రెండు రోజుల పాటు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. మట్టిచరియలు విరిగే అవకాశం ఉన్నందున భక్తులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు తెలిపారు.
ముళ్లయ్యనగిరిలో దేవీరమ్మ జాతర

కొండ కోనలు దాటుకుని..