
టైరు పేలి.. రెండు బస్సులు ఢీ
● మండ్య వద్ద ఇద్దరు మృతి
మండ్య: రెండు కేఎస్ ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోగా, 70 మంది గాయపడిన సంఘటన మండ్య జిల్లాలోని మళవళ్ళి తాలూకాలోని బాచనహళ్ళి వద్ద జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం జరిగింది. కొళ్ళెగాల వైపు నుంచి బెంగళూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు టైరు పేలిపోయింది, దీంతో అదుపుతప్పి ఎదురుగా అవతలి లేన్‌లో మళవళ్ళి నుంచి కొళ్ళెగాలకు వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. రెండు బస్సుల్లోను ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు మహిళలు మరణించగా, 70 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా ఉన్న కొందరిని మండ్య మిమ్స్‌కు తరలించారు. మండ్య గ్రామీణ పోలీసులు, ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.