ఎయిడ్స్‌పై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌పై అవగాహన అవసరం

Oct 20 2025 9:16 AM | Updated on Oct 20 2025 9:16 AM

ఎయిడ్

ఎయిడ్స్‌పై అవగాహన అవసరం

రాయచూరు రూరల్‌: దేశాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్‌పై ప్రచారం చేపట్టాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుగుణ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా ఆరోగ్యశాఖ, రెడ్‌రిబ్బన్‌, రిమ్స్‌, పాఠశాలలు, స్వచ్ఛంధ సంస్థల ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ వ్యాధిపై వీధి నాటకాల జాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. ఎయిడ్స్‌ అంటువ్యాధి కాదన్నారు. సమాజంలో ఈ వ్యాధికి గురైన వారిపై వివక్ష చూపొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్‌ వ్యాధిపై గ్రామస్థాయి నుంచి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సంతోష్‌ కుమార్‌, మఠపతి, మల్లయ్య, శాంత కుమార్‌, దేవమ్మ, మహాలింగమ్మ, శారద, అన్నపూర్ణ, సువర్ణ, జమున తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

రాయచూరు రూరల్‌: జిల్లా యువకులు క్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని తారానాథ్‌ విద్యా సంస్థల ఉపాధ్యక్షుడు పవన్‌ పేర్కొన్నారు ఆదివారం మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో రాయచూరు, కొప్పళ జిల్లాల సిటీ ఎలెవన్‌ అండర్‌–14 క్రికెట్‌ శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. సుమాదు 110 జట్లు శిక్షణ శిబిరానికి వచ్చాయి. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. క్రీడాకారులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. క్రీడల్లో రాణించి, పాఠశాల తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సిటీ ఎలెవన్‌ క్లబ్‌ అధ్యక్షుడు శరణ రెడ్డి, రాజశేఖర్‌, రాజేష్‌, వెంకట రెడ్డి, సంజీవ నాయక్‌, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి యువజనోత్సవాలు ప్రారంభం

రాయచూరు రూరల్‌: విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని మానవీయ మౌల్యాలను పెంచుకోవాలని అదనపు జిల్లా అధికారి శివానంద పిలుపునిచ్చారు. ఆదివారం వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, యువజన క్రీడల సేవా శాఖ ఆధ్వర్యంలో 2025–26 జిల్లా స్థాయి యువజనోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో విద్యార్థులకు ఉత్సవాలపై ఆసక్తి తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్స్‌కు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. యువకులు భారతీయ సంస్కృతిని కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో 180 మంది యువకులు పాల్గొనడం అభినందనీయమన్నారు. ఉత్సవాల్లో యువజన క్రీడల సేవా శాఖ అదికారి వీరేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.

రాష్ట్రావతరణ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

రాయచూరు రూరల్‌: జిల్లాలో నవంబర్‌ 1న జరగనున్న రాష్ట్రావతరణ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు జిల్లా అధికారి శివానంద పేర్కొన్నారు. ఆదివారం జిల్లా అధికారి కార్యాలయంలో రాష్ట్రావరణ వేడుకలపై సమావేశం నిర్వహించారు. నగరంలోని కర్ణాటక సంఘం ఆధ్వర్యంలో తల్లి భువనేశ్వరి చిత్రపటానికి పూలమాల వేసి ఊరేగించడం జరుగుతుందన్నారు. మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల పాటు కన్నడ సినిమాలను ప్రదర్శించాలని ఆదేశించడం జరిగిందన్నారు. దుకాణాలు, హోటళ్లకు కన్నడ భాషలో నామఫలాకాలు రాయించాలని సూచించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు శాంతప్ప, కొండప్ప, చంద్రశేఖర్‌ పాటిల్‌, మురళీధర్‌ కులకర్ణి, శ్రీనివా్‌స్‌, గురునాథ్‌, వినోద్‌ రెడ్డి, అధికారులు విజయ రాణి, వీరేష్‌ నాయక్‌, రమేష్‌ గౌడ తదితరులు పాల్గొన్నారు.

కేఎంసీ పరిశోధన ఆస్పత్రి వైద్యుల ఘనత

మగబిడ్డ కడుపులో బ్రూణం తొలగింపు

చిన్నారి ఆరోగ్యం ఉండటంతో డిశ్చార్జ్‌

హుబ్లీ: అప్పుడే పుట్టిన మగబిడ్డ కడపులో 8 సెంటీమీటర్ల పొడవు ఉన్న బ్రూణాన్ని ఈనెల 8వ తేదీన హుబ్లీ కేఎంసీ పరిశోధన ఆస్పత్రి వైద్యులు తొలగించిన విషయం తెలిసిందే. చిన్నారి పూర్తిగా కోలుకోవడంతో ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. వివరాలు.. సెప్టెంబర్‌ 23న ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకాకు చెందిన మహిళ రెండో బిడ్డకు జన్మనిచ్చింది. మగబిడ్డ పొట్టలో బ్రూణం ఉన్నట్లు వైద్య బృందం గుర్తించింది. కిమ్స్‌ ఆస్పత్రిలో అనుభవం గల వైద్య నిపుణుడు, బాలల ఆపరేషన్‌ విభాగం డాక్టర్‌ రాజ శంకర్‌, డాక్టర్‌ రుపాలి నేతృత్వంలో చిన్నారికి ల్యాబోస్కోపీ చేసి కడుపులోని ఏ భాగంలో బ్రూణం ఉందో నిర్ధారించారు. అనంతరం చిన్నారికి మత్తు మందు ఇచ్చి పొట్ట భాగంలో చిన్న రంద్రం చేసి ఆపరేషన్‌ చేశారు. కడుపులో ఉన్న 8 సెంటిమీటర్ల ఉన్న బ్రూణాన్ని విజయవంతంగా బయటకు తీశారు. బ్రూణానికి మొదడు, హృదయం లేవు. వెన్నెముక అలాగే చిన్న కాళ్లు, చేతులు ఉన్నట్లు గుర్తించారు. ఎఫ్‌ఈటీయూఎస్‌ఐఎన్‌ఎఫ్‌ఈటీయూగా పిలిచే ఈ కేసు ప్రపంచంలోనే అరుదైనది కావడంతో బ్రూణం గడ్డను వ్యాధుల నిర్ధారణ వైద్య శాస్త్ర విభాగంలో నిల్వ చేశారు. వైద్యులకు బోధన నిమిత్తం దాచి పెట్టారు.

ఎయిడ్స్‌పై అవగాహన అవసరం 1
1/3

ఎయిడ్స్‌పై అవగాహన అవసరం

ఎయిడ్స్‌పై అవగాహన అవసరం 2
2/3

ఎయిడ్స్‌పై అవగాహన అవసరం

ఎయిడ్స్‌పై అవగాహన అవసరం 3
3/3

ఎయిడ్స్‌పై అవగాహన అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement