
టూరిస్టు బస్సు బోల్తా.. 18 మందికి గాయాలు
శివమొగ్గ: ప్రైవేటు టూరిస్టు బస్సు వేగంగా వెళ్తూ పల్టీలు కొట్టిన ప్రమాదంలో 18 మంది గాయపడిన సంఘటన శివమొగ్గ జిల్లాలోని సాగర్ తాలూకా ఆడుకట్టె వద్ద ఆదివారం జరిగింది. చిక్కబళ్లాపురం జిల్లాలోని గౌరిబిదనూరుకు చెందిన 45 మంది సిగందూరు చౌడేశ్వరి దేవస్థానం దర్శనానికి వెళ్లి, అక్కడి నుంచి వడనబైలులో ఉన్న పద్మావతి ఆలయానికి బయల్దేరారు. ఈ సమయంలో ప్రమాదం జరిగింది. పురుషులు, మహిళలు సహా బాలలు గాయాలపాలయ్యారు. స్థానిక ప్రజలు వారిని సాగర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు బ్రేక్ విఫలం కావడమే కారణమని డ్రైవర్ చెప్పాడు.