
బళ్లారి– కుమటా బస్సు పల్టీ
యశవంతపుర: కేఎస్ ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో 49 మంది ప్రయాణికులు గాయపడిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా కార్వార వద్ద జరిగింది. శనివారం రాత్రి అంకోలా తాలూకా వడ్డి ఘాట్‌లో బస్సు పల్టీ పడింది. కుమటా – శిరసి మార్గంలో రోడ్డు పనులు జరుగుతున్న కారణంగా సంచారాన్ని బంద్ చేశారు. శిరసికి వెళ్లే వాహనాలను వడ్డి ఘాట్ రోడ్డు వైపు మళ్లించారు. ఇరుకై న మలుపుల్లో బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల పల్టీ కొట్టింది. ఈ బస్సు బళ్లారి సిటీ నుంచి కుమటాకు వెళ్తోంది. డ్రైవరుతో సహా 49 మంది గాయాల పాలయ్యారు. అంకోలా, కుమటా కు బాధితులను తరలించారు. మరోవైపు శివమొగ్గ, మండ్య వద్ద ప్రమాదాలు జరిగాయి.
49 మందికి గాయాలు