
దూసుకొచ్చిన మత్స్యం.. జాలరి మృత్యువాత
యశవంతపుర: సముద్రంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఊహించడం కష్టం. చేపల్ని పట్టడంలో నిపుణుడైన జాలరి... చేప గుద్ది చనిపోయాడు. ఈ ఘటన కారవార వద్ద అరేబియా సముద్రంలో జరిగింది. కార్వార తాలూకా మాజాళికి చెందిన యువ జాలరి అక్షయ (24) మంగళవారం చేపలు పట్టడానికి పడవలో సముద్రంలోకి వెళ్లాడు. ఈ సమయంలో ఓ అడుగు పొడవైన చేప నీటిలో ఎగిరి అక్షయ కడుపు మీద తగిలింది. అతనికి తీవ్ర రక్తగాయం కావడంతో నొప్పితో విలవిలలాడడంతో మిగతా జాలర్లు వెంటనే కార్వారలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గాయానికి కుట్లు వేసి ఇంటికి పంపారు. బుధవారం ఆరోగ్యం బాగాలేదంటూ ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యాడు, గురువారం తెల్లవారుజామున చనిపోయాడు.
జాలర్ల నిరసన
పేగులకు బలమైన గాయాలు కావడమే కారణమని వైద్యులు పేర్కొన్నారు. కాగా, వైద్యులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారని మత్యృకారులు ఆరోపిస్తున్నారు. ౖపైపెన కుట్లు వేసి ఇంటికి పంపారు. కనీసం ఎక్స్‌రే, స్కాన్ చేసి ఉంటే కడుపులో ఏమైందో తెలిసేది, చేప ముళ్లు గుచ్చుకొని తీవ్ర గాయమైనా సరిగా వైద్యం చేయలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
కార్వార వద్ద విషాద ఘటన

దూసుకొచ్చిన మత్స్యం.. జాలరి మృత్యువాత