
కులగణనకు వెళ్లి చెరువులో శవమై...
కోలారు: సామాజిక విద్యా సమీక్ష (కుల గణన) కోసం వెళ్లిన ఉపాధ్యాయురాలు చెరువులో శవమై తేలింది. వివరాలు.. కోలారు నగరానికి చెందిన అక్తర్ బేగం (50) మంగళవారం సమీక్ష కోసం నరసాపురానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబీకులు నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం కేజీఎఫ్ తాలూకా అయ్యప్పల్లి చెరువులో ఆమె మృతదేహం కనిపించింది. అక్తర్ బేగం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేతమంగల పోలీసులు మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీసి ఎస్‌ఎన్‌ఆర్ జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఆమె బస్సులో వెళ్లినట్లు టికెట్ లభ్యమైంది.

కులగణనకు వెళ్లి చెరువులో శవమై...