వరుణుడి జోరు..
రాయచూరు రూరల్: మహరాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు దంచికొడుతున్నాడు. భారీ వర్షాలకు వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఉజ్జయిని, సీనా, బోరి వాగులు నీటితో కళకళలాడుతున్నాయి. భీమా నది నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంజి కేంద్రాలను ఏర్పాటు చేశామని కలబుర్గి జిల్లా కలెక్టర్ పౌజియా తర్నూమ్ వెల్లడించారు. బీదర్ జిల్లా కమలా నగర్, ఔరాద్, హులసూరు, బాల్కీ, బీదర్‌లో పంట పొలాలు, ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. కలబుర్గి జిల్లా షేడమ్ తాలూకా ఉత్తరాది మఠం నీటిలో మునిగింది. వరద ఉధృతికి నీటిలో రెండు లారీలు ఆగిపోయాయి. జేవర్గి తాలూకా కట్ట సంగావి వద్ద జాతీయ రహదారి–50పై రాకపోకలకు ఆంటకం కలిగింది. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడంతో ప్రజలు నడుచుకుంటూ వెళ్లిపోయారు. బెళగావి జిల్లాలో బాదామి, రామదుర్గలో నవిల్ తీర్థ జలాశయాల నుంచి నీరు దిగువకు విడుదల చేశారు. బస్సులు నీటిలోనే రాకపోకలు సాగించాయి. విజయపుర సోలాపూర్ మధ్య వాహనాల రాకపోకలను బంద్ చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. బీదర్‌లో కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోయింది. వర్షపు నీరు గ్రామంలోకి చేరింది. చించోళి తాలుకా జెట్టూరులో వాగులో నీటి ప్రవాహానికి 40 ఎద్దులు కొట్టుకుని పోయాయి. బీదర్ తాలూకా మల్ఖేడ్‌లో నెల రోజుల పసికందుతో మహిళ మిద్దె పైకి ఎక్కింది.
క.క.భాగంలో విస్తారంగా వర్షాలు
భీమా నది నుంచి 3.50 లక్షల
క్యూసెక్కుల నీరు విడుదల
దెబ్బతిన్న పంటలు
నీటిలో కొట్టుకుపోయిన 40 ఎద్దులు
బీదర్‌లో చెరువు కట్ట తెగడంతో
గ్రామంలోకి ప్రవేశించిన నీరు
వరద హోరు
వరద హోరు
వరద హోరు
వరద హోరు
వరద హోరు
వరద హోరు