
భగత్‌సింగ్‌కు ఘన నివాళి
రాయచూరు రూరల్: నగరంలో ఆదివారం భగత్‌సింగ్ జయంతిని ఘనంగా నిర్వమించారు. సూపర్ మార్కెట్ వద్ద ఏఐడీవైఓ, ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో నాయకులు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చెన్నబసవ మాట్లాడుతూ.. భగత్‌సింగ్ క్రాంతితో కూడిన ఆందోళనలు చేపట్టారన్నారు. దేశంలో ప్రజలకు గృహం, విద్య, ఉద్యోగం, ఆహార భద్రత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తున్న వ్యతిరేక విధానాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అంతకు ముందు భగత్‌సింగ్ చిత్రపటం వద్ద నినాదాలు చేశారు.
హొసపేటె: షహీద్ భగత్ సింగ్ ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలని ఏఐడీవైఓ జిల్లా నేత పాలక్ష కోరారు. ఆదివారం స్థానిక పునీత్ రాజ్‌కుమార్ మైదానంలో భగత్‌సింగ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాలక్ష మాట్లాడుతూ.. భగత్‌సింగ్ ఆశయం దోపిడీని అంతం చేయడమే నిజమైన స్వేచ్ఛ అని తెలిపారు. కార్యక్రమంలో ప్రకాష్ నాయక్ ఉమా తదితరులు పాల్గొన్నారు.

భగత్‌సింగ్‌కు ఘన నివాళి