
ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి ప్రాధాన్యత
రాయచూరు రూరల్: జిల్లాలో ఎత్తిపోతల పథకాల అభివృద్ధిఇక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం మాన్వి తాలూకా ముద్దన గుడ్డ ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నదాతలకు శాశ్వత నీటి పారుదల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహిస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల రైతుల జీవన విధానంలో మార్పులు తెచ్చేందుకు సర్కార్ కృషి చేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్, జిల్లా అధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, ఎస్పీ పుట్ట మాదయ్య, అమరేశప్ప, అబ్దుల్, బసనగౌడ పాటిల్, బాల స్వామి, రుద్రప్ప తదితరులు పాల్గొన్నారు.