
హళేబాతి గ్రామంలో శ్రమదానం
బళ్లారి రూరల్: దావణగెరె జిల్లా జెడ్పీ సీఈఓ గిత్తమాధవ విఠల్‌రావు శనివారం హళేబాతి గ్రామంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ స్వయంగా పరకను చేతపట్టుకుని వీధుల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు. చెత్తబండిని నడిపారు. ఇంటింటికి వెళ్లి పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. రోడ్లపై చెత్త వేయడం ద్వారా పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతాయని తెలిపారు. ఇంటి వద్ద పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛత హీ సేవా పాక్షిక–2025లో భాగంగా శ్రమదానం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ అధికారులు, జీపీ అధ్యక్షుడు, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.