మైసూరు/ మండ్య: మైసూరు నగరం దసరా నవరాత్రి వేడుకలతో మురిసిపోతోంది. పలు వేదికలలో జరుగుతున్న నానారకాల వినోద సాంస్కృతిక కార్యక్రమాలను చూడడానికి నగరవాసులు, టూరిస్టులు చలో అంటున్నారు.
జట్కా బండ్లలో విహారం
● శనివారం వాయుసేన హెలికాప్టర్ల ప్రదర్శన ఆకట్టుకుంది. ఎర్రని పొగ వదులుతూ గాలిమోటార్లు చేసిన విన్యాసాలను కేరింతలు కొడుతూ తిలకించారు.
● తరువాత వారసత్వ జట్కా బండ్ల ర్యాలీ సాగింది. టూరిస్టులను తీసుకుని గుర్రపుబండ్లు నగరంలో రౌండ్లు వేశాయి.
● మరోవైపు మైసూరు దసరా గజరాజులు బంగారు అంబారీని మోసే సాధనను తీవ్రతరం చేశాయి. గజరాజు అభిమన్యుపై చెక్క అంబారీని బిగించి నగరవీధుల్లో నడిపించారు.
● పర్యాటక దినోత్సవాల పేరుతో ప్యాలెస్ ముందు మహిళల నృత్యాలు అబ్బురపరిచాయి
● సాయంత్రం నుంచి విద్యద్దీపాల వెలుగుల మధ్య టాప్‌లెస్ బస్సులో పర్యాటకుల నగర యాత్ర హుషారుగా సాగింది.
శ్రీరంగపట్టణంలో యోగా
మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో దసరా సంబరాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఆలయం ముందు శనివారం సామూహిక యోగా వేడుకను నిర్వహించారు. జిల్లాధికారి డా.కుమార్ ప్రారంభించారు. జీవితంలో యోగాను నిత్యం ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.
మైసూరులో దసరా సంబరాల అట్టహాసం
నింగీ నేలా వినోదహేల
నింగీ నేలా వినోదహేల
నింగీ నేలా వినోదహేల
నింగీ నేలా వినోదహేల
నింగీ నేలా వినోదహేల
నింగీ నేలా వినోదహేల
నింగీ నేలా వినోదహేల
నింగీ నేలా వినోదహేల