
బెంగళూరులో సైబర్ కమాండ్
రియల్ ఎస్టేట్ అని రూ.11 కోట్లు టోపీ
● సైబర్‌క్రైం వింగ్, సైబర్ సెక్యూరిటీ వింగ్, జనజాగృతి దళం సహా మరో విభాగం ఈ సీసీసీలో ఉంటుంది.
● బెంగళూరులో మొత్తం 45 సైబర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాటిలోను, సైబర్‌క్రైం సహాయవాణి 1930లో నమోదయ్యే ఫిర్యాదులను సీసీసీ నిర్వహిస్తుంది. కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు నివేదికను కోర్టుకు అందజేస్తుంది.
● అన్నిరకాల ఆన్‌లైన్ నేరాలు, నేరగాళ్ల ఆచూకీ కనిపెట్టడమే సీసీసీ పని.
● ఆధునిక టెక్నాలజీ ద్వారా దుండగుల ఫోన్లు, కంప్యూటర్ల ఐపీ అడ్రస్‌ను కనిపెట్టడం, ఎక్కడి నుంచి వంచనకు పాల్పడుతున్నారో గుర్తించి అరెస్ట్ చేస్తుంది.
● అలాగే పోలీసు సిబ్బంది, ఇతర విభాగాలకు సైబర్ నేరాల కట్టడి గురించి శిక్షణనందిస్తుంది.
బనశంకరి: కన్నడనాట సైబర్ నేరాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. డిజిటల్ అరెస్టు చేసి, ఈకేవైసీ అని లక్షల రూపాయలను కేటుగాళ్లు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ సైబర్ కమాండ్ సెంటర్ (సీసీసీ)ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్‌నేరాలకు అడ్డుకట్టవేయడానికి స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పరచాలని ఏప్రిల్‌నెలలో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం సీసీసీని ఏర్పాటు చేసి దానికి చీఫ్‌గా డీఐజీ ప్రణవ్ మొహంతిని నియమించింది. సైబర్ నేరాల కేసులను సీఐడీ నుంచి సీసీసీ కి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. సీఐడీ కార్యాలయంలోనే సీసీసీ ఏర్పాటైంది.
మహిళ డిజిటల్ అరెస్టు,
రూ.8.80 లక్షల వసూలు
మహిళా శాస్త్రవేత్తను మూడురోజుల పాటు డిజిటల్ అరెస్టు చేసిన సైబర్ వంచకులు రూ.8.80 లక్షలు దోచేశారు. బెంగళూరు న్యూ హౌసింగ్‌కాలనీ నివాసి డాక్టర్ ఎస్.సంధ్య బాధితురాలు. ఈ నెల 16న ఆమెకు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి.. తాను పోలీస్ అధికారిని, మీ సిమ్‌ను దుర్వినియోగం చేయడం వల్ల 17 కేసులు ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో మానవ అక్రమ రవాణా దందాలో మీరు భాగస్వాములయ్యారు అని బెదిరించారు. అలా ఆమె నుంచి రూ.8.80 లక్షలను తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. తరువాత మోసాన్ని గుర్తించిన బాధితురాలు సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఆన్‌లైన్ నేరాల సత్వర దర్యాప్తు
ఏర్పాటు చేసిన సర్కారు
4 విభాగాలుగా నిఘా
16 వేలకు పైగా
పెండింగ్ కేసులు
2025 జూలై చివరినాటికి రాష్ట్రంలో 16 వేలకు పైగా సైబర్‌క్రైం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పోలీసు సిబ్బంది కొరత ఇందుకు కారణం. సీసీసీలో అధికారులు, టెక్ నిపుణులను నియమిస్తారు. దీనివల్ల కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని ఆశాభావం ఉంది.
బనశంకరి: స్థిరాస్తి వ్యాపారంలో అధిక లాభం ఇప్పిస్తామని రూ.11.28 కోట్లు వంచనకు పాల్పడ్డాడో మోసగాడు. బెంగళూరు ఇందిరానగర డిఫెన్స్ కాలనీ నివాసి అశోక్‌కుమార్, అతని మిత్రులు బాధితులు. అతని ఫిర్యాదు మేరకు.. అశోక్‌కుమార్ 2014 నుంచి రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడి స్నేహితుడైన మధుబాబు, భాస్కర్ అనే వ్యక్తిని పరిచయం చేశారు. తాను రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, మీరు డబ్బు పెట్టుబడిపెడితే దండిగా లాభం ఇస్తానని చెప్పాడు. ఇతని మాటలు నమ్మిన అశోక్‌కుమార్ తనకు పరిచయం ఉన్న 9 మందిని భాస్కర్ వద్దకు తీసుకెళ్లాడు. వారి నుంచి భాస్కర్ రూ. 6.54 కోట్లు, అశోక్‌కుమార్ నుంచి రూ.4.74 కోట్లు వసూలు చేశాడు. అందరూ కలిసి రియల్‌ఎస్టేట్‌ను ప్రారంభిద్దామని చెప్పి ఓ ఆఫీసును తెరిచాడు. కానీ భాస్కర్ మోసగాడు అని గుర్తించారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా అతడు పట్టించుకోలేదు. అంతేగాక వీరు ఇచ్చిన చెక్‌లను కూడా దుర్వినియోగానికి చేశాడు. దీంతో బాధితులు వైట్‌ఫీల్డ్ సీసీబీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.

బెంగళూరులో సైబర్ కమాండ్

బెంగళూరులో సైబర్ కమాండ్