
పేలిన వంట గ్యాస్ సిలిండర్
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా గాదిగనూరు గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి తృటిలో పెనుప్రమాదం తప్పింది. గ్రామంలోని హాలప్ప అనే న్యాయవాదికి చెందిన ఇంట్లో ప్రతి రోజూ మాదిరిగానే కాఫీ కలిపేందుకు పొయ్యిని వెలిగిస్తుండగా అప్పటికే సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఉన్నఫళంగా సిలిండర్ పేలి మిద్దె పైకప్పు కూలిపోయింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హాలప్ప(42), కవిత(32) గంగమ్మ(63), మైలారప్ప(48), మల్లమ్మ, మల్లికార్జున, మలియమ్మ, కృత్తిక, గంగమ్మ తదితర 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే మెరుగైన చికిత్స కోసం సండూరు తాలూకా తోరణగల్లులోని సంజీవిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, హొసపేటె గ్రామీణ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటన స్థలానికి పలువురు ప్రముఖులు చేరుకొని బాధితులకు అండగా నిలిచారు. ఘటనపై గాదిగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందగానే జిల్లా పర్యటనలో ఉన్న ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహమ్మద్‌ఖాన్ ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. గాయపడిన వారికి అన్ని విధాలుగా మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు.
గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శిస్తున్న మంత్రి తదితరులు
పేలుడు తీవ్రతకు ధ్వంసమైన ఇల్లు
8 మందికి తీవ్ర గాయాలు
ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
తృటిలో తప్పిన పెనుప్రమాదం
పేలుడు తీవ్రతకు ఇల్లు ధ్వంసం

పేలిన వంట గ్యాస్ సిలిండర్

పేలిన వంట గ్యాస్ సిలిండర్

పేలిన వంట గ్యాస్ సిలిండర్