
బన్నినగరలో ఫ్లెక్స్ వివాదం
హుబ్లీ: ఓ ఫ్లెక్స్ విషయంగా కారల్‌మార్క్స్ నగర్‌లో జరిగిన రెండు గుంపుల మధ్య వాగ్వాదం కేసుకు సంబంధించి మూడు కేసులు దాఖలు చేసుకున్న పోలీస్ శాఖ మొత్తం 8 మందిని అరెస్ట్ చేసింది. ఈ గొడవకు సంబంధించి ఆజాద్ నగర్ పోలీసులు రెండు కేసులు నమోదు చేసుకున్నట్లు ఆ జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్ మీడియాకు వివరణ ఇచ్చారు. ఇదే కేసుకు సంబంధించి ఆమె మీడియాతో మాట్లాడుతూ సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశాం. దర్యాప్తు చురుగ్గా సాగుతోందన్నారు. ఎవరూ కూడా సోషల్ మీడియాలో ఉద్వేగ, ఉద్రేకంతో కూడిన ప్రకటనలు చూడరాదని, పోస్టులు పెట్టరాదని హెచ్చరించారు. ఈ హెచ్చరికలను ఉపేక్షిస్తే అలాంటి వారిపై నిర్దాక్షిణ్యంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పరిస్థితి శాంతియుతంగా ఉందన్నారు. ఎవరూ కూడా అసత్య వార్తలను వ్యాపింపజేయరాదన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వరాదని ఆమె సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్లెక్స్‌ని తొలగించాలని ఓ గుంపు, కుదరదని మరో గుంపు మధ్య వివాదం రేకెత్తింది. తక్షణమే ఘర్షణ హద్దుమీరకుండా పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హొసపేటె: అతి వేగంగా వస్తున్న బస్సును బైక్ ఢీకొనడంతో ద్విచక్రవాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. వెనుక ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని మోరగేరి గ్రామానికి చెందిన హరీష్(23)గా గుర్తించారు. అతని స్నేహితుడు సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు స్నేహితులు బైక్‌పై ఇట్టిగి గ్రామం నుంచి హగరిబొమ్మనహళ్లికి వెళుతుండగా హొసపేటె నుంచి దావణగెరెకు వెళుతున్న బస్సును బైక్ ఢీకొంది. గాయపడిన సంతోష్‌ను చికిత్స కోసం హగరిబొమ్మనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఇట్టిగి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
పర్యాటక కేంద్రాల
అభివృద్ధిపై నిర్లక్ష్యం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరచడంలో అధికారులు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం తగదని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు చెన్నారెడ్డి విచారం వ్యక్తం చేశారు. శనివారం నవరంగ్ దర్వాజ భవనంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో చారిత్రకత కలగిన పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరచడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని ఖండించారు. కార్యక్రమంలో సుగుణ, శివ ప్రకాష్, కాశప్ప, చంద్రశేఖర్‌లున్నారు.
ఇద్దరిపై పోక్సో కేసు నమోదు
హుబ్లీ: ౖమెనర్ విద్యార్ధినిని లిఫ్ట్ ఇస్తామంటూ మభ్య పెట్టి కారులో ఎక్కించుకొని దారి మధ్యలో లైంగికంగా అత్యాచారం చేసిన కేసులో ఇద్దరిపై తడక్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసుకున్నారు. ప్యారా మెడికల్ కోర్సు తొలి సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థిని కళాశాలకు వెళ్లి కున్నూరు గ్రామం నుంచి మమదాపుర గ్రామానికి నడుచుకుంటూ తిరిగి వస్తుండగా ఆ గ్రామ పరిచయస్తుడు ప్రవీణ్ లమాణి, అభిషేక్ లిఫ్ట్ ఇస్తామంటూ కారులో కూర్చొబెట్టుకున్నారు. అనంతరం మార్గమధ్యంలో అటవీ ప్రాంతంలో నోటిలో దుస్తులు కుక్కి అత్యాచారం చేసినట్లు విద్యార్థిని తల్లి గంగవ్వ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన క్రమంలో తడక్ పోలీసులు పోక్సో కేసు దాఖలు చేసుకున్నట్లు ఎస్‌ఐ పరశురామ తెలిపారు. బాధిత విద్యార్థినిని ఆ జిల్లా బాలల సంరక్షణాధికారి కార్యాలయ సిబ్బందికి అప్పగించారు.
అధ్యాపకులను
నియమించాలని ధర్నా
రాయచూరు రూరల్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులను భర్తీ చేయాలని కోరుతూ ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించుకోకుండా కాలయాపన చేయడాన్ని తప్పుబట్టారు. త్వరితగతిన అతిథి అధ్యాపకులను నియమించాలని ఒత్తిడి చేశారు.

బన్నినగరలో ఫ్లెక్స్ వివాదం

బన్నినగరలో ఫ్లెక్స్ వివాదం