
పంచాయతీపై
నిందలు వేయొద్దు
కోలారు: పారదర్శక పాలన, అత్యుత్తుమ గ్రామ పంచాయతీగా పేరుపొందిన సూలూరు గ్రామ పంచాయతీపై కొంతమంది అకారణంగా యూట్యూట్‌లలో దుష్ప్రచారం చేస్తున్నారని పంచాయతీ అధ్యక్షుడు పెమ్మశెట్టి హళ్లి సురేష్ తెలిపారు. శనివారం నగరంలోని పాత్రికేయుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. చొక్కహళ్లి చిన్మయ విద్యాలయ పన్నుల వసూలు గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిని ఆపకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ సభ్యులు ఎం నారాయణస్వామి, సూలూరు అశోక్, గాయత్రమ్మ, నందిని మాలతేష్, శ్యామలమ్మ పాల్గొన్నారు.
వేమగల్ ప్రగతికి పెద్దపీట
కోలారు: వేమగల్– కురుగల్ పట్టణ పంచాయతీ కి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా డి.అనూష, సీఎస్ వెంకటేష్‌లు శనివారం పట్టణ పంచాయతీ కార్యాలయంలో పదవులను స్వీకరించారు. సభ్యులందరి సహకారంతో అభివృద్ది కార్యక్రమాలను పెద్దపీట వేస్తామన్నారు. తాగునీరు, స్వచ్చత, డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక సౌలభ్యాలను అందించడానికి ప్రామాణిక ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారిని పూలదండలతో సన్మానించారు.
అధ్యక్ష, ఉపాధ్యక్షుల
ఎన్నిక ఏకగ్రీవం
మాలూరు : తాలూకాలోని చిక్కతిరుపతి జీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు శనివారం జరిగిన ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్ష స్థానానికి కాంగ్రెస్‌కు చెందిన జీవీ కుమార్ , ఉపాధ్యక్ష స్థానానికి గాయత్రి మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎమ్మెల్యే కైవె నంజేగౌడ అభినందించారు. పంచాయతీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. తాపం స్థాయీ సమితి మాజీ అధ్యక్షుడు నాగేష్, దరఖాస్తు సమితి అధ్యక్షుడు హనుమంతప్ప పాల్గొన్నారు.